Navaratri 2024: దేవీ నవరాత్రులు ప్రారంభ తేదీ.. ఈ తొమ్మిది రోజులు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి
నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే తొమ్మిది రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. అదే సమయంలో నవరాత్రులలో కొన్ని పనులు తప్పక చేయాలి. ఇలా చేయడం వలన నవరాత్రి పూజల వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. దేవీ నవరాత్రులలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
హిందూ క్యాలెండర్ ప్రకారం నవరాత్రి పూజ ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం ప్రతిపాద తిధి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూ మత విశ్వాసం ప్రకారం దేవీ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో ప్రధానంగా దుర్గాదేవిని ఆరాధిస్తారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు.
ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి భూమిపై నివసిస్తుందని.. తన భక్తులను కాపాడుతుందని నమ్మకం. హిందువుల నమ్మకం ప్రకారం నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే తొమ్మిది రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటే పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. అదే సమయంలో నవరాత్రులలో కొన్ని పనులు తప్పక చేయాలి. ఇలా చేయడం వలన నవరాత్రి పూజల వలన శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. దేవీ నవరాత్రులలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
శరన్నవరాత్రులు 2024 ఎప్పుడంటే?
హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 4న తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3వ తేదీ 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది.
దేవీ నవరాత్రుల సమయంలో చేయాల్సిన పనులు ఏమిటంటే
- దుర్గ దేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగు శ్రేయస్సు, అదృష్టం, శక్తి, ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు పువ్వులు సమర్పించండి. ఎరుపు రంగు బట్టలు సమర్పించండి.
- నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు పుజిస్తారు. దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు, పండ్లు, స్వీట్లు సమర్పించండి.
- నవరాత్రులలో ప్రతిరోజూ దుర్గాదేవి మంత్రాలను పఠించండి. ధ్యానం చేయండి. దీంతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
- నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయండి లేదా సేవ చేయండి. ఇది చాలా ధర్మబద్ధమైన చర్యగా పరిగణించబడుతుంది. పేదవారికి దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
శారదీయ నవరాత్రులలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి
- నవరాత్రులలో 9 రోజులు అఖండ జ్యోతిని వెలిగించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఎవరైనా అఖండ జ్యోతిని వెలిగిస్తే అఖండ జ్యోతిని ఆరిపోనివ్వవద్దు.
- నవరాత్రుల 9 రోజులలో పొరపాటున కూడా తామసిక ఆహారం తినొద్దు. మద్యం సేవించకూడదు.
- నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండండి. మంచి ఆలోచనలను అలవర్చుకోండి. వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి.
- పూజ సమయంలో క్రమశిక్షణను తప్పకుండా పాటించండి. నవరాత్రులలో సూర్యోదయ సమయంలో నిద్ర లేవడం.. దుర్గాదేవిని భక్తి శ్రద్దలతో పూజించడం అవసరం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి