Chanakya Niti: పిల్లలకు చిన్నతనం నుంచే ఈ మూడు విషయాలు నేర్పించమంటున్న చాణక్య.. ఎందుకంటే

తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే కొన్ని విషయాలు నేర్పిస్తారు. పిల్లల పెంపకంపై శ్రద్ధ చూపలేక లేదా కొన్ని ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడంలో విఫలమైన తల్లిదండ్రులు కొందరు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఆచార్య చాణక్యుడు ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పవలసిన 3 విషయాలు ఉన్నాయి. వీటితో పిల్లల జీవితంలో విజయం సాధించడమే కాదు.. దేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుందని చెప్పారు చాణక్య.

Chanakya Niti: పిల్లలకు చిన్నతనం నుంచే ఈ మూడు విషయాలు నేర్పించమంటున్న చాణక్య.. ఎందుకంటే
Acharya Chanakya
Follow us

|

Updated on: Sep 28, 2024 | 3:44 PM

తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతారు. తమ బిడ్డ ఎలా పెరిగి పెద్దవుతాడు? వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? పెద్దయ్యాక ఏమవుతాడు? అంటూ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఆందోళన చెందుతూ.. భవిష్యత్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలకు చిన్ననాటి అలవాట్లు మంచివైనా, చెడ్డవైనా శాశ్వతంగా మారుతాయని.. అటువంటి అలవాట్లు వారిని త్వరగా వీడిపోవని నమ్ముతారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే కొన్ని విషయాలు నేర్పిస్తారు. పిల్లల పెంపకంపై శ్రద్ధ చూపలేక లేదా కొన్ని ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడంలో విఫలమైన తల్లిదండ్రులు కొందరు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఆచార్య చాణక్యుడు ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పవలసిన 3 విషయాలు ఉన్నాయి. వీటితో పిల్లల జీవితంలో విజయం సాధించడమే కాదు.. దేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తుందని చెప్పారు చాణక్య.

సత్య మార్గంలో నడవడం నేర్పండి

ఎవరైనా సరే ఎప్పుడూ దేనికోసం అబద్ధాలను ఆశ్రయించకూడదని చాణక్యుడు చెప్పాడు. సత్య మార్గాన్ని అనుసరించే వ్యక్తులకు చెడు జరగదు. అలాంటి వారి జీవితంలో తక్కువ సమస్యలు ఉంటాయి. ఒక్కసారి చెప్పిన అబద్ధాన్ని దాచాలంటే మరిన్ని అబద్ధాలు చెప్పాలి అంటారు. కనుక పిల్లలు చిన్నప్పటి నుండి సత్యమార్గాన్ని అనుసరించేలా చెయ్యాలి. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో మంచి సమర్థులు అవుతారు. అందుకే చాణక్యుడు ఎప్పుడూ పిల్లలు నిజమే మాట్లాడేలా చూడాలని సూచించాడు.

క్రమశిక్షణతో ఉండడం నేర్పండి

ఎవరి జీవితంలోనైనా క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఎందుకంటే క్రమ శిక్షణ ప్రతిచోటా పాటించడం అలవాటు అవుతుంది. పాఠశాల్లో, కళాశాలల్లో, లేదా ఆఫీసులో కూడా క్రమ శిక్షణ పాటించడం అలవాటు అవుతుంది. అందుకే పిల్లలకు చిన్నతనం నుండే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేస్తే వారికి భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుంది. వ్యక్తికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి సమాజంలో గౌరవించబడతాడు. వారి ఆరోగ్యం కూడా ఇతరుల కంటే మెరుగ్గా ఉంటుంది. క్రమశిక్షణ అనేది వ్యక్తికి సమయం విలువను తెలియజేస్తుంది. ఆచార్య చాణక్యుడు ప్రపంచంలో సమయం కంటే శక్తివంతమైనది ఏదీ లేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మంచి విలువలు ఇవ్వాలి

వ్యక్తి ఎలా ఉన్నాడో అని అతని రూపాన్ని బట్టి కాదు.. ఆ వ్యక్తీ ప్రవర్తనను బట్టి నిర్ణయించబడుతుంది. పిల్లలకు చిన్నతనం నుండి మంచి విలువలను అలవాటు చేస్తే తల్లిదండ్రుల పేరును ఎప్పటికీ కించపరిచేలా ప్రవర్తించరు. పైగా విలువతో ఉన్న వ్యక్తులకు సంఘంలో గౌరవం లభించడమే కాదు తమ కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుండే మంచి విద్యను అందించి వారి జీవితానికి సంబంధించిన నిజమైన ఆదర్శాలను పరిచయం చేయాలి. పిల్లల ప్రవర్తనలో ప్రేమ, సామరస్యం, స్వచ్ఛత, సహజత్వాన్ని పెంపొందించేలా జాగ్రత్త వహించాలని ఆచార్య చాణక్య చెప్పారు. ఇలా చేయడం వలన పిల్లల భవిష్యత్ కు మరింత సహాయం చేస్తుంది. సమాజంలో అభివృద్ధి చెందుతాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి