ఈ ఏడాది దేవీ నవరాత్రులు 9 కాదు 10 రోజులు.. దుర్గాదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకోండి

ఆశ్వయుజమాసం శుక్ల పక్షం ప్రతిపాద తేదీ అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే అక్టోబర్ 4 మధ్యాహ్నం 2:58 గంటలకు ముగుస్తుంది. కొన్ని పంచాంగం ప్రకారం ఈసారి అష్టమి.. నవమి తిథి రెండూ అక్టోబర్ 11 న వచ్చాయి. అటువంటి పరిస్థితిలో నవమి తిథి పూజకు అనుకూలమైన సమయం అక్టోబర్ 12వ తేదీ. దసరా పండగ ఉదయం తిధిలో జరుపుకుంటారు కనుక.. 2024 శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు కాదు మొత్తం10 రోజులు జరుపుకోనున్నారు.

Navaratri 2024
Follow us

|

Updated on: Oct 01, 2024 | 3:00 PM

పితృ పక్ష 2024 ముగియనుంది. వెంటనే శరన్నవరాత్రులు మొదలు కానున్నాయి. ఈ నవరాత్రుల్లో 9 రోజుల పాటు దుర్గాదేవి అవతారాలైన తొమ్మిది మంది దేవతలను పూజిస్తారు. అమ్మవారి పేరుతో ఉపవాసం ఉంటారు. హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈసారి నవరాత్రులు 03 అక్టోబర్ 2024 నుంచి ప్రారంభంకానున్నాయి. నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు జరుపుకోవడం సాంప్రదాయం. అయితే ఈసారి మాత్రం నవరాత్రి ఉత్సవాలను 0 రోజుల పాటు జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది నవరాత్రులు 9 కాదు 10 రోజులు ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసుకుందాం.

నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే?

నవరాత్రులు ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతాయి. నవరాత్రులు 11 అక్టోబర్ 2024 వరకు కొనసాగనున్నాయి. విజయదశమి పండుగ అక్టోబర్ 12 న జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా తొమ్మిది రూపాలను పూజిస్తారు. వారి పేర్లతో ఉపవాసం ఉంటారు. దీని తరువాత పదవ రోజున చెడుపై మంచి విజయం సాధించిన గుర్తుగా దసరా వేడుకను జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

10 రోజుల పాటు నవరాత్రులు ఎందుకంటే

ఆశ్వయుజమాసం శుక్ల పక్షం ప్రతిపాద తేదీ అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే అక్టోబర్ 4 మధ్యాహ్నం 2:58 గంటలకు ముగుస్తుంది. కొన్ని పంచాంగం ప్రకారం ఈసారి అష్టమి.. నవమి తిథి రెండూ అక్టోబర్ 11 న వచ్చాయి. అటువంటి పరిస్థితిలో నవమి తిథి పూజకు అనుకూలమైన సమయం అక్టోబర్ 12వ తేదీ. దసరా పండగ ఉదయం తిధిలో జరుపుకుంటారు కనుక.. 2024 శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు కాదు మొత్తం10 రోజులు జరుపుకోనున్నారు.

4 రోజుల్లోనే ఈ 2 అరుదైన యోగాలు

నవరాత్రులలో మహాశక్తికి ప్రతీకగా భావించే దుర్గామాతను పూజిస్తారు. దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా మనిషి జీవితంలోని అన్ని దుఃఖాలు తొలగిపోతాయని, జీవితంలో సానుకూలత, బలం చేకూరుతుందని నమ్మకం. ఈసారి నవరాత్రుల రోజున అరుదైన యోగం కూడా రూపొందుతోంది. ఇది సర్వార్థ సిద్ధి యోగం. ఇది శుభ యోగం. ఈ యోగంలో పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయి. ఈసారి నవరాత్రుల సందర్భంగా 4 రోజులు.. ఈ యోగాలు పడుతున్నాయి. పంచాంగం ప్రకారం ఈ అరుదైన యోగా అక్టోబర్ 5 న ప్రారంభమై అక్టోబర్ 8 వరకు ఉంటుంది. దీంతో పాటు ఈసారి నవరాత్రుల సందర్భంగా అరుదైన రవియోగం కూడా ఏర్పడుతోంది. ఈ శుభ యోగంలో పూజించడం వల్ల సమాజంలో వ్యక్తి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో లాభాలు పొందుతాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

ఈఏడాది దేవీ నవరాత్రులు 9 కాదు 10 రోజులు 4 రోజుల్లో 2అరుదైన యోగాలు

విదేశాలకు వెళ్తున్నారా? ఈ క్రెడిట్ కార్డులు ఉండాల్సిందే..

నేటి నుంచి DSC 2024 అభ్యర్ధులకు వెరిఫికేషన్.. ఫోన్లకు మెసేజ్‌లు

కాన్సూర్‌లోనూ బంగ్లా చిత్తు.. 2-0 తేడాతో సిరీస్ భారత్ కైవసం

మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఈ టెస్టులు బెస్ట్!

దేవరలో నటించిన ఈమె గుర్తుందా.?
దేవరలో నటించిన ఈమె గుర్తుందా.?
పదేళ్లుగా బెంగుళూరులో పాకిస్తానీ భర్త, బంగ్లాదేశీ భార్య మకాం..

అతి తక్కువ ధరకే బ్రాండెడ్ షూస్.. భారీ డిస్కౌంట్స్ మిస్ కాకండి..

నోని పండు తింటే.. కలిగే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

హైదరాబాద్‌లో దారుణం.. కూతురు ఇంటి తాళం పగులగొట్టి చూడగా..

వీడేం డాక్టర్.? అనంతపురం ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం..

అమ్మో.. అన్ని అణు బాంబులే.! చైనా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి..

ఇది.. దేవర జాతర.! తారక రాముడి కలెక్షన్ ప్రభంజనం.

వాళ్ళిద్దరూ హిందువులే కాదు.. జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య వ్యాఖ్యలు.

పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.

ఆరేళ్లప్పుడు కిడ్నాపయ్యాడు.. 70 ఏళ్ల తర్వాత ఊహించని క్షణాలు.!

AIతో మీలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా.? వీడియో

ఇది మామూలు పిల్లి కాదు.! 1000 మైళ్ల దూరంలోని ఇంటికి..

పడవలో 30 కుళ్లిన మృతదేహాలు.. అవి ఎవరివంటే.! వీడియో

దేవుడి ప్రసాదంలో ఎలుక.! సిద్ధి వినాయకుని ప్రసాదంలో.. వీడియో వైరల్