AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాలయ అమావాస్య రోజున 3 చర్యలు చేయండి.. పూర్వీకుల ఆశీర్వాదంతో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి

ప్రతి సంవత్సరం భాద్ర ప్రద మాసంలోని  కృష్ణ పక్ష అమావాస్య రోజున మరణించిన తిధి తెలియని వారికీ లేదా ఏవైనా అనివార్య కారణాల వల్ల పూర్వీకులకు శ్రాద్ధ కర్మలను చేయలేని వారికీ పిండ ప్రదానం లేదా తర్పణం ఇస్తారు. అందుకే దీనిని పూర్వీకుల అమావాస్య లేదా మహాలయ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం సర్వ పితృ అమావాస్య చాలా ముఖ్యమైనది.

మహాలయ అమావాస్య రోజున 3 చర్యలు చేయండి.. పూర్వీకుల ఆశీర్వాదంతో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి
Sarva Pitru Amavasya
Surya Kala
|

Updated on: Oct 01, 2024 | 4:05 PM

Share

హిందూ మతంలో సర్వ పితృ అమావాస్య తిధికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజున పూర్వీకులకు నివాళులు అర్పిస్తారు. ఈ తిథిని ప్రతి సంవత్సరం భాద్ర ప్రద మాసంలోని  కృష్ణ పక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున మరణించిన తిధి తెలియని వారికీ లేదా ఏవైనా అనివార్య కారణాల వల్ల పూర్వీకులకు శ్రాద్ధ కర్మలను చేయలేని వారికీ పిండ ప్రదానం లేదా తర్పణం ఇస్తారు. అందుకే దీనిని పూర్వీకుల అమావాస్య లేదా మహాలయ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం సర్వ పితృ అమావాస్య చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజున సంవత్సరంలో చివరి, రెండవ సూర్యగ్రహణం కూడా ఏర్పడుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజున శ్రాద్ధం కర్మలు చేయడం శ్రేయస్కరమా? లేదా తెలుసుకుందాం..

సర్వ పితృ అమావాస్యతో పితృ పక్షం ముగుస్తుంది. ఈ రోజున పూర్వీకులను తలచుకుంటూ శ్రాద్ధ కర్మలను చేయడం, పిండ ప్రదానం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఈ రోజున చేసే ఏదైనా పరిహారం ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో పూర్వీకులను స్మరిస్తూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇలా చేయడం వలన పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని.. జీవితంలో అనేక సమస్యలు దూరమవుతాయని విశ్వాసం.

హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం సర్వ పితృ అమావాస్య తిథి అక్టోబర్ 1 రాత్రి 9:40 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 2 మధ్యాహ్నం 2:19 గంటలకు ఉంటుంది. ఈ అమావాస్యను మోక్షదాయిని అమావాస్య అని కూడా అంటారు. ఉదయ తిథి ప్రకారం అమావాస్య తిథి అక్టోబర్ 2వ తేదీన మాత్రమే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నెరవేరని కోరికలు నెరవేరుతాయి సర్వ పితృ అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహారాన్ని ఆలయంలో నైవేద్యంగా సమర్పించాలి. కాకి, ఆవు, కుక్కకు కూడా నువ్వుల లడ్డూలను తినిపించండి. ఇలా నువ్వుల లడ్డూను తినిపించే సమయంలో మనసులో కోరికను తలచుకోండి. ఇలా చేయడం వల్ల చాలా రోజులుగా నెరవేరని కోరికలు కూడా నెరవేరుతాయి.

ఈ దిశపై ప్రత్యేక శ్రద్ధ వహించండి

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈశాన్య దిక్కును పవిత్రంగా భావిస్తారు. ఇది దేవతల నివాసంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో ఇంట్లో సానుకూలత కోసం, పూర్వీకులను పూజించాలి. స్మరించుకోవాలి. ఈ దిశలో దీపం వెలిగించాలి. దీనివల్ల ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం ఉంటాయి. డబ్బు వచ్చి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి

సర్వ పితృ అమావాస్య అంటే పూర్వీకులను స్మరించుకోవడం, వారికి నివాళులు అర్పించడం. ఈ రోజున చేసే పూజలు, దానాలు ఫలాలను ఇస్తాయి. ఈ సమయంలో లక్ష్మీ దేవి ముందు నెయ్యి దీపం వెలిగించి 108 సార్లు లక్ష్మీ మంత్రాన్ని జపించాలి. దీంతో ఆర్థిక సంక్షోభాల నుంచి ఉపశమనం లభిస్తుంది. సర్వ పితృ అమావాస్య రోజున 21 సార్లు తులసి మాలతో జపం చేయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..