Diwali 2024: ఈ ఏడాది దీపావళి పండగ విషయంలో గందరగోళం.. అక్టోబర్ 31 నా, నవంబర్ 1 నా ఎప్పుడు జరుపుకోవాలంటే..

దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం దీపావళి ఖచ్చితమైన తేదీ విషయంలో ప్రజలలో గందరగోళం ఉంది. దీపావళి అమావాస్య 31 అక్టోబర్ న వచ్చిందా లేదా 1 నవంబర్ తేదీన వచ్చిందా అనే విషయంలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథి అక్టోబర్ 31 మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమై నవంబర్ 1 సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది.

Diwali 2024: ఈ ఏడాది దీపావళి పండగ విషయంలో గందరగోళం.. అక్టోబర్ 31 నా, నవంబర్ 1 నా ఎప్పుడు జరుపుకోవాలంటే..
Diwali 2025
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2024 | 4:55 PM

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఒకటి దీపావళి. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని అమావాస్యతిధిన గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడు, సరస్వతి దేవి, కుబేరుడితో పాటు లక్ష్మీ దేవిని నియమ నిష్టలతో పూజిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించడానికి వస్తుందని నమ్ముతారు. ఈ సంవత్సరం దీపావళి ఖచ్చితమైన తేదీ విషయంలో ప్రజలలో గందరగోళం ఉంది. దీపావళి అమావాస్య 31 అక్టోబర్ న వచ్చిందా లేదా 1 నవంబర్ తేదీన వచ్చిందా అనే విషయంలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.

దీపావళి రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు అనేక చర్యలు తీసుకుంటారు. తద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం సదా ఇంట్లోని సభ్యులపై ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐశ్వర్యం, సుఖసంతోషాలు, శ్రేయస్సు ఉంటుందని నమ్మకం. ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మిదేవి అనుగ్రహం వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ ధన ధాన్యాలకు లోటు ఉండదు. దీపావళి రోజున లక్ష్మీపూజ చేస్తారు.

దీపావళి తేదీ, పూజ ముహూర్తం

పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథి అక్టోబర్ 31 మధ్యాహ్నం 3:52 గంటలకు ప్రారంభమై నవంబర్ 1 సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5:36 నుండి 6:16 వరకు లక్ష్మీదేవి పూజకు అనుకూలమైన సమయం. అటువంటి పరిస్థితిలో దీపావళిని 1 నవంబర్ 2024న మాత్రమే జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ధన్ తేరాస్ అక్టోబర్ 29న, ఛోటీ దీపావళి అంటే నరక చతుర్దశి అక్టోబర్ 31న, దీపావళి అంటే లక్ష్మీపూజ నవంబర్ 1న, గోవర్ధన పూజ నవంబర్ 2న, అన్నాచెల్లెళ్ళ పండగ నవంబర్ 3న. జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఇదే పెద్ద కారణం

శాస్త్ర నియమాల ప్రకారం నవంబర్ 1న దీపావళిని ఘనంగా పండితులు చెబుతున్నారు. ప్రదోష అమావాస్య రోజున దీపావళి జరుపుకోవడం శుభప్రదమని అంటున్నారు. అయితే ప్రదోష అమావాస్య అక్టోబర్ 31వ తేదీ, నవంబర్ 1 రెండు తేదీలలో వస్తుంది. అయితే యాదృచ్చికంగా నవంబర్ 1 న ఆయుష్మాన్ యోగం, స్వాతి నక్షత్రం కలయిక జరిగింది. అందుకే దీపావళిని నవంబర్ 1 న జరుపుకోవాలని సూచించారు.

దీపావళి 5 రోజులు జరుపుకుంటారు

దీపావళి పండుగను ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఇది ధన్‌తేరస్‌తో మొదలై దీపావళితో అన్నా చెల్లెళ్ళ పండగతో ముగుస్తుంది. ఈ పండుగను ప్రతి సంవత్సరం అమావాస్య రోజున రాత్రి సమయంలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం త్రయోదశి తిథి అక్టోబర్ 29 బుధవారం వచ్చింది. దీంతో ఈ రోజున ధన్ తేరాస్ పండుగ జరుపుకుంటారు. అక్టోబరు 31వ తేదీ గురువారం ఛోటీ దీపావళి అంటే నరక చతుర్దశిని జరుపుకుంటారు. ప్రధాన పండగైన దీపావళి అమావాస్య పండగను నవంబర్ 1వ తేదీ శుక్రవారం జరుపుకుంటారు. గోవర్ధన్ పూజ మర్నాడు జరుపుకోనుండగా… అన్నా చెల్లెళ్ళ పండగను 03 నవంబర్ 2024 సోమవారం జరుపుకోవాలని సూచించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి