Digital Gold: పొదుపునకు సరికొత్త మార్గం.. కేవలం రూ.10 బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు..

అయితే మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆలోచనల్లోనూ మార్పులు వచ్చాయి.. ఒకప్పుడు బంగారం అంటే నగలు కోసం మాత్రమే అది ఒక స్టేటస్ సింబల్ గా భావించేవారు.. ఇప్పుడు బంగారం ఒక పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. అయితే అందరికీ బంగారంపై పెట్టుబడి పెట్టాలని ఉన్నా.. ఖరీదైన లోహం కావడంతో కొంతమంది పెట్టుబడి విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారికోసం ఈ రోజు మేము ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం..

Digital Gold: పొదుపునకు సరికొత్త మార్గం.. కేవలం రూ.10 బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు..
gold
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2024 | 4:51 PM

భారతయులకు బంగారానికి విడదీయరాని బంధం ఉంది. భారతీయుల వద్ద ఉన్న బంగారం నిల్వలు ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఉన్న బంగారం కొన్ని దేశాల కంటే ఎక్కువ ఉంటుంది.. ఇది అధికారికంగా తేల్చిన లెక్కలు.. అనధికారికంగా దేశంలో బంగారం ఎంత ఉందొ ఎవరూ చెప్పలేరు అని అంటారు. అయితే మారుతున్న కాలంతో పాటు మనుషుల ఆలోచనల్లోనూ మార్పులు వచ్చాయి.. ఒకప్పుడు బంగారం అంటే నగలు కోసం మాత్రమే అది ఒక స్టేటస్ సింబల్ గా భావించేవారు.. ఇప్పుడు బంగారం ఒక పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. అయితే అందరికీ బంగారంపై పెట్టుబడి పెట్టాలని ఉన్నా.. ఖరీదైన లోహం కావడంతో కొంతమంది పెట్టుబడి విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. అలాంటి వారికోసం ఈ రోజు మేము ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం..

ఎవరైనా తక్కువ డబ్బులతో బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే PhonePe మైక్రో సేవింగ్స్ ప్లాట్‌ఫారమ్ జార్ సహకారంతో డైలీ సేవింగ్స్ అనే కొత్త ప్రోడక్ట్ ని ప్రారంభించింది. ఈ ప్రోడక్ట్ సహాయంతో వినియోగదారులు ప్రతిరోజూ 24 క్యారెట్ల డిజిటల్ బంగారంలో చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టవచ్చు. కంపెనీ చెప్పిన ప్రకారం ఈ కొత్త ప్రోడక్ట్ ద్వారా వినియోగదారులు ప్రతిరోజూ డిజిటల్ బంగారంలో కనీసం రూ. 10 నుంచి గరిష్టంగా రూ. 5,000 వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. దీనితో ప్రజలు క్రమంగా డబ్బు ఆదా చేసే అలవాటును పెంపొందించుకోవచ్చు.

‘డైలీ సేవింగ్స్’ ప్రోడక్ట్ స్క్రీమ్ గోల్డ్ టెక్ సొల్యూషన్ సహాయంతో నిర్వహించబడుతుంది. ఇది కేవలం 45 సెకన్లలో డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి

పొదుపుకు కొత్త మార్గం

ఫోన్‌పే ఇన్-యాప్ కేటగిరీ హెడ్ నిహారిక సైగల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ఈ ప్లాట్‌ఫారమ్ లో డిజిటల్ గోల్డ్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని PhonePe “డైలీ సేవింగ్స్” అనే కొత్త ప్రోడక్ట్ ని ప్రారంభించిందని చెప్పారు. ఈ ప్రోడక్ట్ ద్వారా వినియోగదారులు చిన్న మొత్తాలతో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. దీని అర్థం ప్రజలు చిన్న మొత్తంలో చేసే పొదుపులతో తమ ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారని అన్నారు.

బంగారం పెట్టుబడిపై పెరుగుతోన్న ఆసక్తి

ప్రస్తుతం ప్రజలు చౌకగా, సురక్షితమైన మార్గంలో డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారని PhonePe తెలిపింది. ఈ కారణంగా తమ సంస్థ జార్ సహకారంతో కొత్త అడుగు వేసిందని అన్నారు. Jar కి చెందిన గోల్డ్ టెక్ సామర్థ్యాన్ని, PhonePeకి చెందిన 560 మిలియన్లకు పైగా వినియోగదారులను ఏకం చేయడం ద్వారా.. తమ భాగస్వామ్యంలో డిజిటల్ బంగారంలో పెట్టుబడిని మరింత సురక్షితమైనదిగా.. సులభతరంగా చేస్తుందని అన్నారు నీహారిక.

PhonePe , Jar సంస్థల ఈ కలయిక వినియోగదారులకు బంగారంలో చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడానికి సులభమైన మార్గాన్ని అందిస్తుంది. డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం సులభం. సాధారణ ప్రజలకు సురక్షితంగా ఉండేలా రెండు కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.

మరిని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..