Zelio Ebikes: ఇదో ‘మిస్టరీ’ ఈ-స్కూటర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
జీలియో ఈబైక్స్ మరో కొత్త స్కూటర్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ సారి హైస్పీడ్ స్కూటర్‌ని పరిచయం చేసింది. జీలియో మిస్టరీ పేరుతో దీనిని లాంచ్ చేసింది. దీని ధర రూ. 81,999(ఎక్స్ షోరూం) ఉంటుందని ప్రకటించింది. ఇది పట్టణ వాసులకు, పర్యావరణ స్పృహ ఉన్న రైడర్లకు మంచి ఆప్షన్. దీనికి సంబంధించిన పవర్ ట్రెయిన్, ఫీచర్లు, రేంజ్ వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
దేశంలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఉన్న డిమాండ్ ఆధారంగా కంపెనీలు అన్ని క్యూ కడుతున్నాయి. కొత్త ఉత్పత్తులు లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో జీలియో ఈబైక్స్ మరో కొత్త స్కూటర్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ సారి హైస్పీడ్ స్కూటర్‌ని పరిచయం చేసింది. జీలియో మిస్టరీ పేరుతో దీనిని లాంచ్ చేసింది. దీని ధర రూ. 81,999(ఎక్స్ షోరూం) ఉంటుందని ప్రకటించింది. ఇది పట్టణ వాసులకు, పర్యావరణ స్పృహ ఉన్న రైడర్లకు మంచి ఆప్షన్. దీనికి సంబంధించిన పవర్ ట్రెయిన్, ఫీచర్లు, రేంజ్ వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
జెలియో ఈ-బైక్స్ మిస్టరీ పవర్‌ట్రెయిన్..
ఈ కొత్త మిస్టరీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 72V/29AH లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. 72వోల్ట్స్ మోటారుతో వస్తుంది. ఈ స్కూటర్ ఒక ఛార్జ్‌పై 100 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. బ్యాటరీ చార్జింగ్ టైం నాలుగు నుంచి ఐదు గంటలు ఉంటుంది. ఈ ద్విచక్ర వాహనం 120 కిలోల బరువుఉంటుంది. అలాగే 180 కిలోల లోడింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. ఇది వ్యక్తిగత, లోడ్-బేరింగ్ రైడ్‌లను నిర్వహించగలుగుతుంది.
జీలియో ఈ-బైక్స్ మిస్టరీ డిజైన్ ఇలా..
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు వైపు, వెనుకవైపు హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి. ఇవి మృదువైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. అయితే అధునాతన కాంబి-బ్రేక్ సిస్టమ్ భద్రత, నియంత్రణను పెంచుతుంది. అదనంగా, డిజిటల్ డిస్‌ప్లే, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు ఉంటాయి.
జీలియో ఈబైక్స్ మిస్టరీ ఫీచర్లు ఇలా..
ఈ స్కూటర్ బ్లాక్, సీ గ్రీన్, గ్రే, రెడ్ అనే నాలుగు రంగులలో లభించే ఈ ద్విచక్ర వాహనంలో రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, యూఎస్‌బీ చార్జింగ్, డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. మిస్టరీ లాంచింగ్ సందర్భంగా జీలియో ఈబైక్స్ సహ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య మాట్లాడుతూ తాము ఎల్లప్పుడూ ఆవిష్కరణ, స్థిరత్వం పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు. ఇది పనితీరు, విశ్వసనీయత, పర్యావరణ స్పృహతో కూడిన డిజైన్‌ను కలిగి ఉంటుందన్నారు. ఆకట్టుకునే శ్రేణి, అత్యుత్తమ నిర్మాణ నాణ్యత, అధునాతన ఫీచర్‌లతో మిస్టరీ నేటి ప్రయాణికుల అవసరాలను తీర్చుతుందన్నారు. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..