Small Savings Schemes: చిన్న పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లు ఇవి.. పెట్టుబడిదారులు తప్పక తెలుసుకోవాలి..

ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌(పీపీఎఫ్‌), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్‌ఎస్‌సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), సుకన్యా సమృద్ధి యోజన(ఎస్‌ఎస్‌వై)వంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కాగా ఈ పథకాలకు సంబంధించిన కీలక అప్‌ డేట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 30న ఈ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షించింది.

Small Savings Schemes: చిన్న పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లు ఇవి.. పెట్టుబడిదారులు తప్పక తెలుసుకోవాలి..
Investment
Follow us

|

Updated on: Oct 01, 2024 | 6:17 PM

చిన్న మొత్తాల పొదుపు పథకాలు(స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌)కు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. చాలా మంది పెట్టుబడిదారులు వీటిల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌(పీపీఎఫ్‌), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్‌ఎస్‌సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), సుకన్యా సమృద్ధి యోజన(ఎస్‌ఎస్‌వై)వంటి పథకాల్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కాగా ఈ పథకాలకు సంబంధించిన కీలక అప్‌ డేట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 30న ఈ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను సమీక్షించింది. అయితే వచ్చే త్రైమాసికానికి అంటే అక్టోబర్-డిసెంబర్ 2024 త్రైమాసికానికి వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయడం లేదని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వడ్డీ రేట్లు ఇలా..

2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉండవని, అక్టోబర్ 1, 2024 నుంచి మొదలై, డిసెంబర్ 31, 2024తో ముగిసే వరకు, రెండో త్రైమాసికం అంటే 2024 జూలై 1 ప్రకటించిన వడ్డీ రేట్లే కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్లో తెలిపింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం, సుకన్య సమృద్ధి పథకం కింద డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అయితే మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై రేటు 7.1 శాతంగా ఉంటుంది. మిగిలిన చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

  • పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌), పోస్టాఫీసు సేవింగ్స్ డిపాజిట్స్ స్కీమ్‌లలో వడ్డీ రేట్లు వరుసగా 7.1 శాతం, 4 శాతంగా ఉన్నాయి.
  • కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 7.5 శాతం ఉంటుంది.పెట్టుబడులు 115 నెలల్లో మెచ్యూర్ అవుతాయి.
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై వడ్డీ రేటు జూలై-సెప్టెంబర్ 2024 కాలానికి 7.7 శాతంగా ఉంటుంది.
  • ప్రస్తుత త్రైమాసికం మాదిరిగానే, నెలవారీ ఆదాయ పథకం పెట్టుబడిదారులకు 7.4 శాతం వడ్డీని అందిస్తుంది.
  • సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం
  • సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2 శాతం
  • సేవింగ్స్ డిపాజిట్: 4 శాతం
  • 1-సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 6.9 శాతం
  • 2-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.0 శాతం
  • 3-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.1 శాతం
  • 5-సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు: 7.5 శాతం
  • 5-సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు: 6.7 శాతం

నాటి నుంచి యథాతథం..

గత మూడు త్రైమాసికాలుగా వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వం చివరిసారిగా కొన్ని పథకాల్లో మార్పులు చేసింది. భారతదేశంలో చిన్న పొదుపు పథకాలు వ్యక్తులకు డబ్బు ఆదా చేయడానికి సురక్షితమైన, ఆకర్షణీయమైన ఆప్షన్లుగా ఉన్నాయి. సాధారణ పొదుపు ఖాతాలతో పోలిస్తే ఇవి సాధారణంగా మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తాయి. అంతేకాక పన్ను ప్రయోజనాలతో వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వీడేం డాక్టర్.? అనంతపురం ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం..
వీడేం డాక్టర్.? అనంతపురం ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం..
అమ్మో.. అన్ని అణు బాంబులే.! చైనా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి..
అమ్మో.. అన్ని అణు బాంబులే.! చైనా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి..
ఇది.. దేవర జాతర.! తారక రాముడి కలెక్షన్ ప్రభంజనం.
ఇది.. దేవర జాతర.! తారక రాముడి కలెక్షన్ ప్రభంజనం.
వాళ్ళిద్దరూ హిందువులే కాదు.. జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య వ్యాఖ్యలు.
వాళ్ళిద్దరూ హిందువులే కాదు.. జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య వ్యాఖ్యలు.
పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.
పూల మొక్కలకోసం వెళ్తే.. పులి కనిపించింది.! వైరల్ అవుతున్న వీడియో.
ఆరేళ్లప్పుడు కిడ్నాపయ్యాడు.. 70 ఏళ్ల తర్వాత ఊహించని క్షణాలు.!
ఆరేళ్లప్పుడు కిడ్నాపయ్యాడు.. 70 ఏళ్ల తర్వాత ఊహించని క్షణాలు.!
AIతో మీలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా.? వీడియో
AIతో మీలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా.? వీడియో
ఇది మామూలు పిల్లి కాదు.! 1000 మైళ్ల దూరంలోని ఇంటికి..
ఇది మామూలు పిల్లి కాదు.! 1000 మైళ్ల దూరంలోని ఇంటికి..
పడవలో 30 కుళ్లిన మృతదేహాలు.. అవి ఎవరివంటే.! వీడియో
పడవలో 30 కుళ్లిన మృతదేహాలు.. అవి ఎవరివంటే.! వీడియో
దేవుడి ప్రసాదంలో ఎలుక.! సిద్ధి వినాయకుని ప్రసాదంలో.. వీడియో వైరల్
దేవుడి ప్రసాదంలో ఎలుక.! సిద్ధి వినాయకుని ప్రసాదంలో.. వీడియో వైరల్