Electric geysers: చలిపులిని తరిమి కొట్టాలంటే ఇవి ఉండాల్సిందే.. ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపు
వాతావరణంలో క్రమంగా మార్పు వస్తోంది. వర్షాల సీజన్ పూర్తకానున్న నేపథ్యంలో నెమ్మదిగా చలి పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి కాలంలో ఉత్తమ భారత దేశంలో వాతావారణం బాగా చల్లబడిపోతుంది. మైనస్ డిగ్రీల్లోకి టెంపరేచర్ పడిపోతుంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో వాటర్ ట్యాంకులలో నీరు చల్లబడిపోవడంతో ఉదయాన్నే స్కూలుకు వెళ్లే పిల్లలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు స్నానాలు చేయడానికి తీవ్ర ఇబ్బంది పడతారు.
వాతావరణంలో క్రమంగా మార్పు వస్తోంది. వర్షాల సీజన్ పూర్తకానున్న నేపథ్యంలో నెమ్మదిగా చలి పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి కాలంలో ఉత్తమ భారత దేశంలో వాతావారణం బాగా చల్లబడిపోతుంది. మైనస్ డిగ్రీల్లోకి టెంపరేచర్ పడిపోతుంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో వాటర్ ట్యాంకులలో నీరు చల్లబడిపోవడంతో ఉదయాన్నే స్కూలుకు వెళ్లే పిల్లలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు స్నానాలు చేయడానికి తీవ్ర ఇబ్బంది పడతారు. ఇలాంటి సమయంలో వేడి నీరు చాలా అవసరం. నీటిని వేడి చేయడానికి అవసరమైన గీజర్లపై ఫ్లిప్ కార్ట్ బిగ్ మిలియన్ డేస్ సేల్ లో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. బయట మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు, ప్రత్యేకతలతో పాటు గీజర్ కొనుగోలు చేసేటప్పుడు గమనించాల్సిన ముఖ్య అంశాలను తెలుసుకుందాం.
ఓరియంట్ ఎలక్ట్రిక్ గీజర్
ఓరియంట్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ గీజర్ ఫ్లిప్ కార్ట్ లో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఈ 25 లీటర్ల గీజర్ ను కేవలం రూ.5,499కు కొనుగోలు చేయవచ్చు. దీనిలో పది, పదిహేను లీటర్ల పరిమాణంలోనూ లభిస్తున్నాయి. హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డు హోల్డర్లకు పది శాతం ఇన్ స్టెంట్ డిస్కౌంట్ ను అదనంగా అందిస్తున్నారు. అలాగే ప్రతినెలా ఈఎంఐ చెల్లించేలా కూడా ఈ గీజర్ ను కొనుగోలు చేయవచ్చు.
క్రాంప్టన్ గీజర్
మంచి నాణ్యమైన, మన్నికైన గీజర్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. క్రాంప్టన్ 25 లీటర్ల గ్లీజర్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో 6,299కి అందుబాటులో ఉంది. దీనిలో 25 లీటర్ల నీటిని వేడి చేసుకోవచ్చు. కొనుగోలుదారులకు అదనంగా బ్యాంకు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
బజాజ్ గీజర్
చైల్డ్ సేఫ్టీ, స్విర్ల్ ఫో టెక్నాలజీ తో రూపొందించిన 25 లీటర్ల బజాజ్ గీజర్ ఫ్లిప్ కార్ట్ లో అత్యంత తక్కువ ధరకు లభిస్తోంది. కేవలం రూ.6,799కి అందుబాటులో ఉంది. దీనిపై కొన్ని అదనపు ఆఫర్ల కూడా ప్రకటించారు.
గమనించాల్సిన అంశాలు
గీజర్ ను కొనుగోలు చేసేటప్పడు కొన్ని అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ముఖ్యంగా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు స్టార్ రేటింగ్ అనేది చాలా ముఖ్యం. ముందుగా ఆ విషయాన్ని గమనించాలి. రేటింగ్ బాగుంటేనే కొనుగోలు చేయాలి. అలాగే వారంటీతో పాటు బ్రాండ్ కూడా చాలా ప్రధానం. మీరు కొనుగోలు చేసే గీజర్ కు ఇస్తున్న వారంటీ కార్డును జాగ్రత్తగా చదవాలి. విక్రయదారుడిని పూర్తి సమాచారం అడిగి తెలుసుకోవాలి. బ్రాండ్ నాణ్యతను కూడా గమనించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..