Bonalu 2023: బోనమెత్తిన చిన్నారులు.. పోతురాజు విన్యాసాలతో నేత్రపర్వంగా ఊరేగింపు.
పాఠశాలలో బోనాలకు సాంప్రదాయకరంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలను నెత్తిన పెట్టుకున్న చిన్నారులు, మహిళా టీచర్లు నగర వీధుల్లో బోనాల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు విన్యాసాలు , డప్పు దరువులతో ఈ ఊరేగింపు నేత్ర పర్వంగా జరిగింది.

ఖమ్మం లో బోనాలతో, పోతురాజుల విన్యాసాలతో స్కూల్ చిన్నారులు కనువిందు చేశారు. తెలంగాణ సంస్కృతిలో ప్రధాన ఘట్టమైన బోనాల వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు తమ తమ గృహాలనుంచి సాంప్రదాయబద్ధంగా అలంకరించిన బోనాలను స్కూల్ కి తీసుకొని వచ్చారు. పాఠశాలలో బోనాలకు సాంప్రదాయకరంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలను నెత్తిన పెట్టుకున్న చిన్నారులు, మహిళా టీచర్లు నగర వీధుల్లో బోనాల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు విన్యాసాలు , డప్పు దరువులతో ఈ ఊరేగింపు నేత్ర పర్వంగా జరిగింది.
మన సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల సంబరాలు ప్రతికలుగా నిలుస్తున్న నేపథ్యంలో బోనాల సంబరాల ప్రాధాన్యతను తెలియజేయడానికే తమ పిల్లలకు బోనాల ఉత్సవాన్ని నిర్వహించామనీ నిర్వాహకులు తెలిపారు. చిన్నారులు బోనాల ఉత్సవాలను పెద్దలు ఆసక్తిగా తిలకించారు..




మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..