Sattemma Talli Jatara: అడుక్కో మొక్కు తీర్చుకో.. అక్కడ జాతరలో వింత ఆచారం.. కోటీశ్వరుడు సైతం భిక్షం ఎత్తుకోవాల్సిందే..
కొప్పవరం గ్రామం పాడిపంటలకు ప్రసిద్ధి. పూర్వం గ్రామ దేవత అయిన సత్తెమ్మ తల్లి తమ పంట పొలాలకు కాపలాగా ఉండేదని దొంగల బారి నుండి పంటను దొంగిలించకుండా కాపలా కాసేదని గ్రామస్తుల విశ్వాసం. అప్పటి నుండి రెండు సంవత్సరాలకు ఒకసారి వేషాలు ధరించి బిక్షమెత్తుకుని మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్తెమ్మ జాతరలో వింత ఆచారం కొనసాగుతుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సత్తెమ్మ జాతరలో అడుక్కుని మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కోటీశ్వరుడు అయిన కుబేరుడైనా లక్షాధికారైనా సరే మొక్కుకుంటే అడుక్కోవాల్సిందే అంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. పిల్లలు లేని దంపతులు, వ్యాపార అభివృద్ధి కోసం పంటలు బాగా పండాలంటూ మొక్కుకుని మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి ఆచారం. రకరకాల వేషధారులతో మొక్కులు తీర్చుకున్న భక్తులతో కొప్పవరం గ్రామం అంతా సందడే సందడి.
కొప్పవరం గ్రామం పాడిపంటలకు ప్రసిద్ధి. పూర్వం గ్రామ దేవత అయిన సత్తెమ్మ తల్లి తమ పంట పొలాలకు కాపలాగా ఉండేదని దొంగల బారి నుండి పంటను దొంగిలించకుండా కాపలా కాసేదని గ్రామస్తుల విశ్వాసం. అప్పటి నుండి రెండు సంవత్సరాలకు ఒకసారి వేషాలు ధరించి బిక్షమెత్తుకుని మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
మూడు రోజులపాటు జరిగే ఈ జాతర మొదటిరోజు కత్రికుండ నెత్తిన ధరిస్తే సంతానం లేని మహిళలకు సంతానం కలుగుతుందని నమ్మకం. రెండవ రోజు గ్రామ దేవత అయిన సత్తెమ్మ తల్లి నాగదేవతగా ఉందని పుట్టలో పాలు పోసి పూజిస్తారు. అనంతరం గ్రామ దేవత సత్తెమ్మ తల్లిని భక్తితో కొలిచే పూజారులను ఆలయంలోనికి ప్రవేశించకుండా భక్తులు అడ్డుకుని బెత్తంతో కొట్టించుకుని మొక్కు తీర్చుకుంటుంటారు.
చివరి రోజు కుబేరుడైనా, కోటీశ్వరుడైనా సరే రకరకాల వేషధారణలతో భిక్షాటన చేసి వచ్చే నగదు, బియ్యాన్ని అమ్మవారికి సమర్పించుకుని మొక్కు తీర్చుకుంటారు. ఈ జాతరలో RRR సినీ చిత్రీకరణ దృశ్యాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. సంపన్నులైన వారు కోరికలు తీరని వారు వివిధ వేషధారణలో కళాకారులను తలపించే విధంగా అమ్మవారిని తలచుకుంటూ తమ మొక్కులు తీర్చుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..