CM Jagan: నేడు ఉరవకొండలో పర్యటించనున్న సీఎం జగన్.. 4 విడత ఆసరా పథకం నిధులను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నాలుగు విడతల్లో డ్వాక్రా మహిళల బకాయిలు నేరుగా అందజేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 3 విడతల్లో 19, 175 కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండ వేదికగా నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు.

CM Jagan: నేడు ఉరవకొండలో పర్యటించనున్న సీఎం జగన్.. 4 విడత ఆసరా పథకం నిధులను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
Ap Cm Ys Jagan
Follow us
Surya Kala

|

Updated on: Jan 23, 2024 | 6:55 AM

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపధ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఉరవకొండ అందంగా ముస్తాబైంది. నేడు సీఎం జగన్ ఉరవకొండలో పర్యటించనున్నారు. డ్వాక్రా మహిళా సంఘాల ఖాతాల్లో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధులను జమ చేయనున్నారు సీఎం. ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నాలుగు విడతల్లో డ్వాక్రా మహిళల బకాయిలు నేరుగా అందజేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 3 విడతల్లో 19, 175 కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండ వేదికగా నాలుగో విడత నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం 6, 394 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం.

ఈ రోజు ఉదయం పదిన్నరకు సీఎం జగన్ ఉరవకొండ పట్టణానికి చేరుకుంటారు. 10.50 గంటలకు ఉరవకొండ బైపాస్ రోడ్డు సమీపంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం బటన్ నొక్కి వైఎస్సార్ ఆసరా పథకం నిధులను విడుదల చేయనున్నారు. ఉరవకొండలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సీఎం టూర్‌ ఏర్పాట్లు పరిశీలించారు కలెక్టర్ గౌతమి.

గత ఎన్నికల నాటికి 25వేల 570 కోట్ల రూపాయల పొదుపు సంఘాల రుణాలను.. తిరిగి వారికే ఇచ్చి హామీ నిలబెట్టుకుంటున్నారు సీఎం జగన్. వైఎస్సార్ ఆసరా పథకంతో.. 79 లక్షల మంది మహిళలు లబ్ది పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..