AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Festival: రాఖీ పండగ రోజున అన్నదమ్ములకు కాకుండా ఇంకెవరికి రాఖీ కట్టవచ్చు.. శాస్త్రాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోండి

రాఖీ పండగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజును సోదరి, సోదరుడి మధ్య పవిత్ర సంబంధానికి చిహ్నంగా భావిస్తారు. సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి అతని దీర్ఘాయుష్షు, ఆనందాన్ని కోరుకుంటుంది. సోదరుడు తన జీవితాంతం ఆమెను రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. అయితే రాఖీని సోదరుడికి మాత్రమే కట్టవచ్చా? మరికేవరికైనా కట్టవచ్చా ఈ రోజు తెలుసుకుందాం.

Rakhi Festival: రాఖీ పండగ రోజున అన్నదమ్ములకు కాకుండా ఇంకెవరికి రాఖీ కట్టవచ్చు.. శాస్త్రాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోండి
Raksha Bandhan 2025
Surya Kala
|

Updated on: Jul 17, 2025 | 7:08 AM

Share

సోదరుడు, సోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నంగా నిలిచే రాఖీ పండగ భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ. శతాబ్దాలుగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి వారికి దీర్ఘాయుష్షు, ఆనందాన్ని కోరుకోవడం, సోదరులు తమ సోదరీమణులను రక్షించడానికి ప్రతిజ్ఞ చేయడం ఒక సంప్రదాయం. రాఖీ పండుగ రోజున ఒక సోదరి తన సోదరుడికి కాకుండా మరెవరికి రాఖీ కట్టగలదో తెలుసుకుందాం.

దేవుడికి రాఖీ కట్టే సంప్రదాయం రాఖీ కట్టే మొదటి హక్కు దేవుడిదే అని భావిస్తారు. చాలా మంది సోదరీమణులు మొదట శ్రీకృష్ణుడు, శివుడు లేదా గణేశుడికి రాఖీ కడతారు. తరువాత తమ సోదరుడికి రాఖీ కడతారు. ఇలా చేయడం అంటే దేవుడే తమకు మొదటి రక్షకుడు అనే విశ్వాసానికి నిదర్శనం.

అక్కకి చెల్లెలు రాఖీకట్టే సంప్రదాయం ఏ యువతికి అయినా అన్నదమ్ములు లేకుంటే.. ఆమెకు అక్కాచెల్లెలు ఉన్నట్లు అయితే.. ఆమె తన అక్కకు రాఖీ కట్టవచ్చు. ఇది సోదరీమణుల అనుబంధం, ప్రేమ, ఐక్యతకు చిహ్నం.

ఇవి కూడా చదవండి

గురువుకు రాఖీ భారతీయ సంస్కృతిలో గురువును దేవునితో సమానంగా భావిస్తారు. ఒక శిష్యుడు తన గురువుకు రాఖీ కట్టడం అంటే.. అతను గురువును రక్షించి, సేవ చేసి, గౌరవిస్తానని వాగ్దానం చేస్తున్నట్లు అర్థం.

పూజారులు, సాధువులు, ఋషులకు రాఖీ చాలా ప్రదేశాలలో మహిళలు సాధువులు, ఋషులు లేదా ఆలయ పూజారులకు రాఖీ కడతారు. ఇది మత విశ్వాసం, ఆధ్యాత్మిక సంబంధానికి గుర్తుగా నిలుస్తుంది. ఈ సంప్రదాయం ముఖ్యంగా బృందావనం, మధుర, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో కనిపిస్తుంది.

సైనికులకు రక్షణ దారంగా రాఖీ రాఖీ సందర్భంగా సోదరీమణులు భారత సైన్యం, పోలీసు, పారామిలిటరీ దళాల సైనికులకు రాఖీని పంపుతారు లేదా వారే వెళ్లి స్వయంగా రాఖీని కడతారు. ఇది సమాజాన్ని రక్షించే రక్షకుడి పట్ల గౌరవం, విశ్వాసానికి చిహ్నం.

చెట్లకు రాఖీ కట్టడం పర్యావరణ పరిరక్షణ స్ఫూర్తిని పెంపొందించడానికి చాలా మంది చెట్లకు రాఖీ కడతారు. చెట్లను కాపాడుతామని, పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచుతామని ఇది ప్రతిజ్ఞ చేయడం.

రాఖీ పండగ 2025 ఎప్పుడు? పంచాంగం ప్రకారం శ్రావణ మాసం నెల పౌర్ణమి తిథి ఆగస్టు 8న తెల్లవారుజామున 2:12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు ఆగస్టు 9న తెల్లవారుజామున 1:24 గంటలకు ముగుస్తుంది. కనుక ఉదయ తిథి ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు 9, 2025న జరుపుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
పవర్ ప్లాంట్‌లో భారీపేలుడు.. 9 మంది మృతి!
పవర్ ప్లాంట్‌లో భారీపేలుడు.. 9 మంది మృతి!
మీ ఇంట్లో క్యాలెండర్ ఈ దిశలో ఉందా? దురదృష్టం వెంటాడుతుందట!
మీ ఇంట్లో క్యాలెండర్ ఈ దిశలో ఉందా? దురదృష్టం వెంటాడుతుందట!
సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్
సిలిండర్ ఎందుకు పేలుతుంది? మీ ప్రాణాలను కాపాడుకునే బెస్ట్‌ టిప్స్
గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారంటే
గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయడం లేదని.. గ్రామస్తులు ఏం చేశారంటే
ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి..
ఏసీ కొనాలని ఉందా? కేవలం రూ.1 కే కొత్త ఏసీని ఇంటికి తీసుకెళ్లండి..
భారీ మోసం.. రూ. 500 కోట్లతో బోర్డు తిప్పేసిన మరో సంస్థ..!
భారీ మోసం.. రూ. 500 కోట్లతో బోర్డు తిప్పేసిన మరో సంస్థ..!
మీ జుట్టు పెరగకపోవడానికి అసలు కారణం ఇదే.. ఇలా చెక్ పెట్టండి!
మీ జుట్టు పెరగకపోవడానికి అసలు కారణం ఇదే.. ఇలా చెక్ పెట్టండి!
తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!
తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!
పోలీసులనే బురిడీ కొట్టించిన మహిళా ఖైదీ.. వాష్ రూమ్‌కి వెళ్లి..
పోలీసులనే బురిడీ కొట్టించిన మహిళా ఖైదీ.. వాష్ రూమ్‌కి వెళ్లి..
హైదరాబాద్ వాసులకు భారీ గుడ్ న్యూస్..
హైదరాబాద్ వాసులకు భారీ గుడ్ న్యూస్..