Numerology: ఈ సంఖ్య గల వ్యక్తులు పుడుతూనే అదృష్టవంతులు.. అందం, ఆకర్షణ వీరి సొంతం.. ఎప్పుడూ హ్యాపీ లైఫ్..
సంఖ్యాశాస్త్రం నమ్మకాల ప్రకారం.. జనన సంఖ్య మనుషుల స్వభావాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు అతని నడక, నడత, అభిరుచి, కెరీర్ వంటి విషయాలను గురించి కూడా తెలియజేస్తుంది. ఈ రోజు మనం జీవితంలో చాలా ఆనందం, శ్రేయస్సును ఇచ్చే జనన సంఖ్య గురించి తెలుసుకుందాం.. వీరు . దీనితో పాటు, ఈ వ్యక్తులు విలాసాలలో కూడా మునిగిపోతారు.

సంఖ్యాశాస్త్రంలో ఒక వ్యక్తి పుట్టిన తేదీ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. దీని సహాయంతో ఎవరు తమ జీవితాన్ని ఏ విధంగా గడుపుతారు.. ఎవరు ఏ రంగంలో స్థిరపడతారు.. వంటి అనేక రంగాల స్థితిని తెలుసుకోవచ్చు. మూల సంఖ్యను కనుగొనడం చాలా సులభం. ఒక వ్యక్తి పుట్టిన తేదీ సంఖ్యలను జోడించడం ద్వారా మూల సంఖ్యను కనుగొనవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక నెలలో 11వ తేదీన జన్మించినట్లయితే, అతని మూల సంఖ్య 2 అవుతుంది, ఎందుకంటే 1+1=2. ఇది అతని ప్రత్యేక మూల సంఖ్య. ఈ నేపధ్యంలో ఈ రోజు ఆరవ తేదీలో జన్మించిన వారు మాత్రమే కాదు.. ఆరవ సంఖ్య మూల సంఖ్య ఉన్నవారి ప్రవర్తన ఎలా ఉంటుంది? కెరీర్ ఎలా ఉంటుంది తెలుసుకుందాం..
ఈరోజు మనం 6వ సంఖ్య గురించి స్వభావం గురించి తెలుసుకుందాం.. ఏదైనా నెలలో 6, 15 లేదా 24వ తేదీలలో జన్మించిన వ్యక్తికి 6వ సంఖ్య ఉన్నట్లుగా పరిగణించబడుతుంది. ఈ సంఖ్య శుక్రుడికి సంబంధించినది, ఇది ప్రేమ, అందం. సంపదకు కారకంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో ఈ సంఖ్య గల వ్యక్తులు బాల్యం నుంచే ఆనందంగా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. వీరు అందంగా ఉనారు. వీరికి ప్రజలు ఆకర్షితులవుతారు.
6వ సంఖ్య ఉన్న వ్యక్తుల వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అందుకే వీరి వైపు ఆకర్షించే వ్యక్తులు వీరి చుట్టూ తిరుగుతారు. అలాగే ఈ వ్యక్తులు వీరు అందం, వ్యక్తిత్వం కారణంగా ఎంత మంది మధ్యలో ఉన్నా ప్రత్యేకంగా నిలుస్తారు. దీనితో పాటు ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ ఆకర్షణ కేంద్రంగా ఉండటానికి ఇష్టపడతారు. శుక్రుని ప్రభావం కారణంగా ఈ వ్యక్తులు విలాసవంతమైన వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. వాటి కోసం అధికంగా డబ్బులు ఖర్చు చేస్తారు. దీనితో పాటు ఈ వ్యక్తులు కొత్త బట్టలు ధరించడానికి , వస్తువులను ధరించడానికి ఇష్టపడతారు. శుక్రుడిని ఆనందం, విలాస గ్రహంగా కూడా పరిగణిస్తారు. దీని కారణంగా ఈ వ్యక్తులు ఆనందం, విలాసాలలో మునిగిపోతారు.
ఈ 6 వ సంఖ్య మూల సంఖ్య ఉన్న వ్యక్తులు వ్యవస్థీకృత పద్ధతిలో జీవించడానికి ఇష్టపడతారు. అలాగే వీరు చాలా త్వరగా స్నేహితులను చేసుకోవడంలో నిష్ణాతులు. శాంతిని ప్రేమించడంతో పాటు, 6 వ సంఖ్య ఉన్న వ్యక్తులు కూడా చాలా ఉదార గుణాన్ని కలిగి ఉంటారు. శుక్రుని ప్రభావం కారణంగా ఈ వ్యక్తులు సంగీతం, చిత్రలేఖనంలో ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.