Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Puja: కొత్త బైక్ కోసం మంచిరోజు అదే.. పూజ చేయడం ఎలా.?

కొత్త బండి కొన్న తర్వాత పూజ చేయడం చాలా ముఖ్యమని హిందువులు నమ్ముతారు. ఆంజనేయస్వామి గుడిలో లేదా ఇతర దేవాలయాలలో ఈ పూజ చేయవచ్చు. పూజకు కావలసిన సామాగ్రిలో పసుపు, కుంకుమ, గంధం, సింధూరం, అగరబత్తులు, దూపం, కరివేపాకులు, కొబ్బరికాయ, అరిటపళ్ళు, నిమ్మకాయలు, పువ్వులు. నిమ్మకాయలను కట్టడం, కొబ్బరికాయతో దృష్టి తీయడం వంటివి పూజలో భాగం. శుభ దినాలను ఎంచుకోవడం కూడా ముఖ్యం. పూజకు ఖర్చు చాలా తక్కువ. 

Prudvi Battula

| Edited By: Ravi Kiran

Updated on: Jun 11, 2025 | 5:28 PM

కొత్త బండి కొనుగోలు చేసిన తర్వాత, దానికి పూజ చేయడం ద్వారా ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు. బైక్ ఎక్కువ కాలం రిపేర్ కాకుండా ఉంటుందని నమ్ముతారు. పూజను ఆంజనేయస్వామి గుడిలో, విఘ్నేశ్వరుడి గుడిలో లేదా ఇతర దేవాలయాలలో చేయవచ్చు.

1 / 5
పూజకు కావలసిన సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, సింధూరం (ముఖ్యంగా ఆంజనేయస్వామి గుడిలో), అగరబత్తులు, దూపం, కరివేపాకులు లేదా కర్పూరం (మూడు నుండి ఐదు), కొబ్బరికాయ, అరిటపళ్ళు, నిమ్మకాయలు (ఐదు, వీటిలో మూడు బండికికట్టడానికి ఉపయోగిస్తారు), పువ్వులు లేదా పువ్వుల మాల. జై హనుమాన్ లేదు జై దుర్గ భవాని రక్ష కూడా కావాలి. గుమ్మడికాయను కూడా దిష్టి తీయడానికి ఉపయోగించవచ్చు.

2 / 5
ముందుగా బైక్‎పై ఓంకారం లేదా స్వస్తిక్ గుర్తును చందనంతో వేయాలి. కుంకుమతో బొట్లు పెట్టాలి. పూల దండలను వాహనానికి అలంకరించాలి. తీసుకువెళ్ళిన సామాగ్రిని పళ్ళెంలో ఉంచాలి.

3 / 5
పంతులుగారు మంత్రాలు చదివి, పసుపు, కుంకుమను వాహనంపై వేస్తారు. మూడు నిమ్మకాయలను బండికి కట్టాలి, మిగిలినవి చక్రాల కింద ఉంచాలి. కొబ్బరికాయపై కర్పూరం లేదా కరివేపాకులతో వెలిగించి, బైక్‎ చుట్టూ తిప్పి, దిష్టి తీయాలి. అక్షింతలు, పువ్వులు వేసి దండం పెట్టడంతో పూజ పూర్తవుతుంది. పూజ తర్వాత, ఇతర దేవాలయాలకు వెళ్ళవచ్చు.

4 / 5
బైక్ కొనుగోలు చేసే రోజు చాల ముఖ్యం. సోమవారం, బుధవారం, గురువారాలు శుభప్రదమని చెబుతారు. మంగళవారం, ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం ఉన్న మంగళవారం రోజు బండి కొనుగోలు చేయకూడదు. దీనికి శుభ నక్షత్రాలు విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి.

5 / 5
Follow us