Tripura Sundari Temple: కర్ణుడు పూజించిన అమ్మవారు.. కొబ్బరి కాయను సమర్పిస్తే కోరిన కోర్కెలు తీర్చే త్రిపుర సుందరి ఆలయం ఎక్కడంటే..

త్రిపుర సుందరి ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. 5000 సంవత్సరాల క్రితం.. త్రిపుర సుందరి ద్వాపర యుగంలో మహావీరుడైన కర్ణుని కుల దేవత అని నమ్ముతారు. కర్ణుడు త్రిపుర సుందరి తల్లికి భక్తితో సేవ చేసేవాడు.

Tripura Sundari Temple: కర్ణుడు పూజించిన అమ్మవారు.. కొబ్బరి కాయను సమర్పిస్తే కోరిన కోర్కెలు తీర్చే త్రిపుర సుందరి ఆలయం ఎక్కడంటే..
Tripura Sundari Temple
Follow us

|

Updated on: Sep 29, 2022 | 2:31 PM

Tripura Sundari Temple: తల్లి జగదాంబ, జగత్ జనని, జగదాంబ, అమ్మవారు ఇలా అనేక ఇతర పేర్లతో దుర్గాదేవిని స్మరిస్తూ పూజిస్తారు. తమ జీవితంలోని అన్ని కష్టాలను అమ్మవారు తీరుస్తారని నమ్మకం. నవరాత్రి సందర్భంగా ద్వాపర యుగంలో కర్ణుడు పూజించిన అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు 14 కి.మీ దూరంలో ఉన్న తేవర్ గ్రామంలో త్రిపుర సుందరి తల్లికి పూజలు చేస్తారు. ఈ అమ్మవారిని  దర్శనం చేసుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. ఇక్కడ కొలువైన అమ్మవారు త్రిపుర సుందరిగా ప్రపంచమంతటా ప్రసిద్ధిగాంచారు.  అమ్మవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.

త్రిపుర సుందరి ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. 5000 సంవత్సరాల క్రితం.. త్రిపుర సుందరి ద్వాపర యుగంలో మహావీరుడైన కర్ణుని కుల దేవత అని నమ్ముతారు. కర్ణుడు త్రిపుర సుందరి తల్లికి భక్తితో సేవ చేసేవాడు. కర్ణుడు ఎంత దానం చేసినా అతని ఖజానా ఎప్పడూ నిండుగా.. బంగారంతో ఉంటుందని త్రిపుర సుందరి కర్ణునికి వరం ఇచ్చింది. కర్ణుడు అమ్మవారిని ఎల్లప్పుడూ నీకు సేవ చేసి నీ అనుగ్రహం పొందాలంటే పరిహారాన్ని చూపించమని కోరాడు. దీంతో త్రిపుర సుందరి తనను భక్తిశ్రద్దలతో పూజించి.. ఆలయంలో కొబ్బరికాయను భక్తితో సమర్పించే భక్తుని కోరికలు నెరవేరుతాయని వరం ఇచ్చింది. అప్పటి నుంచి త్రిపుర సుందరి ఆలయంలో కొబ్బరికాయలు కట్టడం ప్రారంభించారు.

2 వేల సంవత్సరాల నాటి విగ్రహం త్రిపుర సుందరి ఆలయ కమిటీ పూజారులు మాట్లాడుతూ.. ఈ ఆలయానికి పురావస్తు ప్రాధాన్యముండడం విశేషం. పురావస్తు శాఖ వారు త్రిపుర సుందరి విగ్రహాన్ని కూడా పరిశీలించారు. ఈ విగ్రహం సుమారు 2 వేల సంవత్సరాల నాటిదని చెప్పారు, అయితే ఈ విగ్రహం 5 వేల సంవత్సరాల కంటే పాతదని హిందూ పురాణాల ద్వారా తెలుస్తోంది. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి రూపాలు కలిగిన భగవతి త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. త్రికూట్ పర్వతంలో ఉన్న వైష్ణో దేవి కూడా ఈ ముగ్గురు దేవతల పిండి రూపాన్ని కలిగి ఉంది. త్రిపుర సుందరి ఆలయం మాత్రమే అమ్మవారి విగ్రహాలు కనిపించే ఏకైక ఆలయం. ఇదే ఈ ఆలయ ప్రత్యేకత.

ఇవి కూడా చదవండి

కోరికలు నెరవేర్చడం కోసం కొబ్బరికాయలు: ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. తమ కోర్కెలు తీర్చేందుకు అమ్మవారి ఆ స్థానంలో కొబ్బరికాయలు కొడతారు. ఆలయానికి సంబంధించి అనేక ఇతిహాసాలు, నమ్మకాలు ఉన్నాయి. తల్లి జగదాంబ  ఆశీర్వాదం భక్తులపై ఉంటుంది.  ప్రతి సంవత్సరం నవరాత్రిల్లో ఈ ఆలయం భారీ భక్తుల రద్దీ నెలకొంటుంది. లక్షలాది మంది భక్తులు త్రిపుర సుందరి ఆలయాన్ని సందర్శిస్తారు.

పూజారులు ఏమంటారు? త్రిపుర సుందరి ఆలయ మొదటి పూజారి రమేష్ దూబే (80 సంవత్సరాలు), 10 సంవత్సరాల వయస్సులో, తల్లి భగవతి తనకు కలలో కనిపించిందని చెప్పారు. తన త్రిపుర సుందరి రూపం ఉన్న ప్రదేశాన్ని చెప్పాడు. దీని తర్వాత అతను ఈ స్థలాన్ని కనుగొన్నాడు. అప్పట్లో అది భయంకరమైన అడవి. అడవి మధ్యలో తీగచెట్టు కింద తల్లి త్రిపుర సుందరి విగ్రహం కనిపించింది. ఆ తర్వాత తన సేవను ప్రారంభించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).