Navaratri 2022: బెజవాడ, బాసరలో అంబరాన్నంటుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు..

Navaratri 2022: బెజవాడ, బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయ్‌. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ.. బాసరలో జ్ఞానసరస్వతి.. ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమివ్వనున్నారు.

Navaratri 2022: బెజవాడ, బాసరలో అంబరాన్నంటుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు..
Navaratri
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 25, 2022 | 9:35 PM

Navaratri 2022: బెజవాడ, బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయ్‌. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ.. బాసరలో జ్ఞానసరస్వతి.. ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమివ్వనున్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందడి అంబరాన్నంటుతోంది. ఇవాళ్టి నుంచి అక్టోబర్‌ ఐదు వరకు వేడుకలు జరగనున్నాయ్‌. ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమివ్వనున్నారు కనకదుర్గ అమ్మవారు. మొత్తం పది అవతారాల్లో భక్తులకు దర్శనమివ్వనుంది జగన్మాత. ఈరోజు బంగారు రంగు చీరలో స్వర్ణ కవచాలంకృతారంతో మెరిసిపోతున్నారు దుర్గాదేవి. రేపు శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా, 28న శ్రీగాయత్రీదేవిగా, 29న శ్రీ అన్నపూర్ణాదేవిగా, 30న శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమివ్వనుంది దేవీమాత. ఇక, అక్టోబర్‌ ఒకటిన మహాలక్ష్మీదేవిగా, రెండున సరస్వతీదేవిగా, మూడున దుర్గాదేవిగా, నాలుగన మహిషాసురమర్ధినిగా కనిపించనుంది జగన్మాత. ఇక, చివరి రోజు ఆకుపచ్చ చీరలో రాజరాజేశ్వరిదేవిగా దర్శనమివ్వనున్నారు దుర్గాదేవి.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై సందడి ఇలాగుంటే, బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలోనూ శరన్నవరాత్రి వేడుకలు అంబరాన్నంటుతున్నాయ్‌. ఇవాళ్టి నుంచి తొమ్మది రోజులపాటు తొమ్మది రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు సరస్వతి అమ్మవారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!