Narasimha Jayanti 2021: నరసింహ జయంతిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా.. ఈరోజున ఉన్న ప్రత్యేకత ఎంటంటే..
మహావిష్ణు అవతారాలలో నాల్గవ అవతారమే ఈ నరసింహ అవతారం. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరించడానికి విష్ణువు నరసింహ స్వామిగా అవతరించాడట.
మహావిష్ణు అవతారాలలో నాల్గవ అవతారమే ఈ నరసింహ అవతారం. పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడిని సంహరించడానికి విష్ణువు నరసింహ స్వామిగా అవతరించాడట. నరసింహ స్వామి ఎప్పుడూ ఉగ్రరూపంలోనే దర్శనమిస్తాడు. సగం తల సింహం.. శరీరం మానవ రూపంలో ఉంటాడు. తన పరమ భక్తుడు ప్రహ్లాదను రక్షించడానికి విష్ణువు ఈ రూపంలో జన్మించాడు. నరసింహ జయంతి.. అంటే చెడు పై మంచి విజయాన్ని సాధించిన రోజుగా అభివర్ణిస్తారు.
ముహుర్తం.. * నరసింహ జయంతి… మే 25 మంగళవారం. * నరసింహ జయంతి పూజా సమయం ఉదయం 4.26 గంటలకు ప్రారంభమై రాత్రి 7.11 గంటలకు ముగుస్తుంది. * నరసింహ జయంతి ఉపవాసం వదిలే సమయం మే 26న ఉదయం 5.25 గంటలకు. * నరసింహ జయంతి నాడు.. మధ్యాహ్నం సంకల్ప పూజా నిర్వహించే సమయం ఉదయం 10.56.. మధ్యాహ్నం 1.41 వరకు ఉంటుంది. * చతుర్ధశి తితి వద్ద రాత్రి 8.29 మే 25 నుంచి 12.11am కు ఉంటుంది.
నరసింహ జయంతి ఉపవాస నియమాలు.. ఆచారాలు.. నరసింహ జయంతి ఉపవాసం నియమాలు, ఆచారాలు అన్ని ఏకాదశి మాదిరిగానే ఉంటుంది. నరసింహ జయంతి ముందు రోజుకు భక్తులు ఒక్క పూట భోజనం మాత్రమే చేయాలి. సాంప్రదాయకంగా.. భక్తులు బియ్యం, గోధుమలు, ఇతర తృణ ధాన్యాలు తినడం మొత్తం తినకూడదు. నరసింహ జయంతి రోజున మధ్యాహ్నం సంకల్ప్ (ప్రతిజ్ఞ) చేసి సాయంత్రం నరసింహ పూజా చేస్తారు. సూర్యాస్తమయానికి ముందు పూజ చేస్తారు. పురాణల ప్రకారం చతుర్ధశి తిథి సమయంలో సూర్యాస్తమయం సమయంలో నరసింహ పూజలు చేయడం ఇష్టపడతారు. నరసింహ ఇమ్మర్షన్ పూజలు చేసి పేదలకు ఆహారాన్ని అందించిన మరుసటి రోజు ఉపవాసం వదిలిపెడతారు.
ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ బ్యూటీ..