Jabardasth: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మరోసారి చిక్కుకున్న జబర్దస్త్ నటుడు.. గాలింపు చేపట్టిన పోలీసులు..

Red Sandal Smuggling Case: ఎర్రచందనంలో స్మగ్లింగ్ కేసులో మరోసారి జబర్దస్త్ కమెడియన్ పేరు తెరపైకి వచ్చింది. బుల్లితెర షో జబర్ధస్త్ పేరుతో పాపులారిటి

Jabardasth: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో మరోసారి చిక్కుకున్న జబర్దస్త్ నటుడు.. గాలింపు చేపట్టిన పోలీసులు..
Red Sandal Smuggling
Follow us

|

Updated on: May 25, 2021 | 9:28 AM

Red Sandal Smuggling Case: ఎర్రచందనంలో స్మగ్లింగ్ కేసులో మరోసారి జబర్దస్త్ కమెడియన్ పేరు తెరపైకి వచ్చింది. బుల్లితెర షో జబర్దస్త్ పేరుతో పాపులారిటి సంపాదించుకున్న హరి.. గతంలో ఒకసారి ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. తాజాగా మరోసారి ఈ నటుడి పేరు స్మగ్లింగ్ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే గతంలో అరెస్ట్ అయిన సమయంలోనే పలువురు చందనం స్మగ్లర్స్, ఆ గ్యాంగులతో హరికి సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు హరి మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

శేషాచల అడవుల్లో అటవి శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో.. నాగపట్ల, వెస్ట్ బీట్‌, చీకిమానుకోన ద‌గ్గర 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ప‌ట్టుబ‌డ్డారు. వారి వద్ద నుంచి పోలీసులు రెండు నాటు తుపాకులను స్వాదీనం చేసుకున్నారు. అలాగే దాదాపు రూ.3 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం పట్టుబడిన గ్యాంగ్ తో జబర్దస్త్ హరికి సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతడి కోసం పోలీసులు స్పెషల్ టీం గాలింపు చేపట్టినట్లుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పోలీసులు గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతోపాటు, ఇతర కేసులు కూడా నమోదు చేశారు. శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి.. కోట్లు సంపాదించాడని.. అలాగే మరో నటుడి సినిమా కోస ఈ డబ్బులను వినియోగించడాని గతంలో విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే గతంలో ఈ విషయంపై స్పందించిన హరి.. ఒక కానిస్టేబుల్ అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తుంటే పోలీసులకు సమాచారం అందించానని… అదే కోపంతో అతడు తనపై ఇలా తప్పుడు కేసులు పెట్టించి ఇరికించాడని హరి చెప్పారు.

Also Read: ఆర్ యూ వర్జిన్ ? అంటూ ప్రశ్నించిన నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సురేఖా వాణి కూతురు..

మహేశ్ సినిమా కోసం రూటు మార్చుకున్న డైరెక్టర్.. సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ రోల్ అలా ఉండబోతుందా ?

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే