AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ బ్యూటీ..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‏గా

ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ బ్యూటీ..
Ntr Koratala Shiva
Rajitha Chanti
|

Updated on: May 24, 2021 | 2:14 PM

Share

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‏గా కాజల్ నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో ఒక్క కరోనా బ్రేక్ వేసింది. దీంతో ఈ సినిమా చిత్రీకరణ తాత్కలికంగా ఆగిపోయింది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ తన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీయబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. Jr. NTR

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఇక మరోసారి వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇందులో నటించే హీరోయిన్ గురించి.. స్టోరీ ఎలా ఉండబోతుంది అనే విషయాలపై ఇప్పటికే ఎన్నో గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. అయితే వాటిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. Koratala Shiva

కరోనా ప్రభావంతో ఆచార్య సినిమాకు బ్రేక్ రాగా.. ఈ సమయాన్ని కొరటాల శివ ఎన్టీఆర్ కోసం స్క్రీప్ట్ లో మార్పులు చేయడం కోసం వాడుకుంటున్నాడట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇదే వార్త నిజం కాబోతున్నట్లుగా సమాచారం. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా కియారా నటించబోతుందట. ఇప్పటికే ఈ సినిమాకు కియారా ఓకే చెప్పినట్లుగా సమాచారం. అంతేకాదు.. మొదటి షెడ్యూల్ ప్రారంభమైనప్పుడే ఆమె షూటింగ్ పాల్గోనబోతున్నట్లుగా టాక్. ఈ సినిమాలు ఏప్రిల్ 22, 2022న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు కొరటాల శివ.

Also Read: Pushpa Movie: ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్… అల్లు అర్జున్ కోసం అదిరిపోయే సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్..

డాక్టర్లు దేవుళ్ళు కాదు.. వారిలో రాక్షసులు కూడా ఉన్నారు.. వారే నా తండ్రిని చంపేశారు.. ఎవరిని వదలను.. నటి ఆవేదన..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు