డాక్టర్లు దేవుళ్ళు కాదు.. వారిలో రాక్షసులు కూడా ఉన్నారు.. వారే నా తండ్రిని చంపేశారు.. ఎవరిని వదలను.. నటి ఆవేదన..

Sambhavna Seth: బుల్లితెర నటి సంభావన సేత్ డాక్టర్లపై ఫైర్ అయ్యారు. ఇటీవలే తన తండ్రి కరోనాతో కన్నుముశారు. తన తండ్రిని డాక్టర్లే చంపేశారని వాపోయింది.

డాక్టర్లు దేవుళ్ళు కాదు.. వారిలో రాక్షసులు కూడా ఉన్నారు.. వారే నా తండ్రిని చంపేశారు.. ఎవరిని వదలను.. నటి ఆవేదన..
Sambhavna Seth
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2021 | 7:52 AM

Sambhavna Seth: బుల్లితెర నటి సంభావన సేత్ డాక్టర్లపై ఫైర్ అయ్యారు. ఇటీవలే తన తండ్రి కరోనాతో కన్నుముశారు. తన తండ్రిని డాక్టర్లే చంపేశారని వాపోయింది. అతడికి ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు పట్టించుకోలేదని.. వారి నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయారంటూ నటి ఆరోపణలు చేసింది. తన తండ్రిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని మండిపడింది. ఇందుకు కారణమైన వారికి ఎవరిని వదలను అంటూ హెచ్చరించింది. ఈ మేరకు ఓ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది..

ఆ వీడియోలో.. “అందరు డాక్టర్లు దేవుళ్లు కాదు.. వారిలో మనలాంటి వాళ్లను హత్య చేసే రాక్షసులు కూడా ఉన్నారు. వారే నా తండ్రిని చంపేశారు. తండ్రిని కోల్పోవడం అనేది నా జీవితంలోనే ఓ భయంకరమైన పరిస్థితి. కానీ నేను ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తాను. నా తండ్రి నేర్పిన బాటలోనే న్యాయం కోసం పోరాడతాను. ఇందులో నేను గెలిచినా గెలవకపోయినా కొందరిని కచ్చితంగా బయటకు లాగి వారి నిజ స్వరూపం చూపిస్తాను. నా తండ్రి చావుకు కారణమైన జైపూర్ గోల్డెన్ ఆసుపత్రికి లీగల్ నోటీసులు పంపాం. మీలో చాలా మంది ఇలాంటి కష్టాన్ని ఎదుర్కోనే ఉంటారు. కానీ అనేక కారణాల వలన వాటిని ఎదురించలేకపోవచ్చు. ఇప్పుడు మీరు నా పోరాటానికి మద్దతు తెలపండి” అని వేడుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెకు మద్ధతుగా కామెంట్స్ చేస్తున్నారు. మీకు అండగా ఉంటామని సపోర్ట్ చేస్తున్నారు. కాగా మే 8న సంభావన ఓ వీడియో రికార్డ్ చేసింది. ఇందులో తను అడిగే ప్రశ్నలకు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తుననారు. ఆక్సిజన్‌ లెవల్స్‌ కేవలం 55 మాత్రమే ఉన్నా ఆక్సిజన్‌ సాచురేషన్‌ బాగుందని సిబ్బంది చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ వీడియో తీసిన రెండు గంటలకే తన తండ్రి తుది శ్వాస విడిచాడంటూ సంభావన ఎమోషనల్ అయ్యింది.

ట్వీట్…

Also Read: సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో రామ్ గోపాల్ వర్మ సోదరుడు మృతి.. సంతాపం తెలిపిన బోనీ కపూర్…

కోయంబత్తూరులో కరోనా దేవి విగ్రహం.. అచ్చం ఆ నటి మాదిరిగానే ఉందంటున్న నెటిజన్స్.. మీమ్స్ హల్‏చల్..