కోయంబత్తూరులో కరోనా దేవి విగ్రహం.. అచ్చం ఆ నటి మాదిరిగానే ఉందంటున్న నెటిజన్స్.. మీమ్స్ హల్‏చల్..

దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. యావత్ భారత్ కోవిడ్ ప్రభావంతో అల్లాడిపోతుంది.

కోయంబత్తూరులో కరోనా దేవి విగ్రహం.. అచ్చం ఆ నటి మాదిరిగానే ఉందంటున్న నెటిజన్స్.. మీమ్స్ హల్‏చల్..
Corona Devi
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2021 | 7:27 AM

దేశంలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. యావత్ భారత్ కోవిడ్ ప్రభావంతో అల్లాడిపోతుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయి. ఆయా రాష్ట్రాల్లో కటినంగా లాక్ డౌన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో అక్కడి పూజారులు కరోనా అంతం కావాలంటూ కరోనా దేవి విగ్రహం ఏర్పాటు చేసి.. పూజలు.. యజ్ఞాలు చేస్తున్నారు.

Vanitha Vijay Kumar

Vanitha Vijay Kumar

ఇక ఈ కరోనా దేవి విగ్రహంకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇంకేముంది.. నెటిజన్స్ తమ బుర్రకు పని చెప్పారు. మరోసారి తమిళ నటి వనిత విజయ్ కుమార్‏ను లాగారు. కరోనా దేవి విగ్రహం అచ్చం వనితా విజయ్ కుమార్ మాదిరిగానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు.. వనిత విజయ్ కుమార్, కరోనా దేవి విగ్రహంతో మీమ్స్ కూడా రెడీ చేసారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నటి వనిత విజయ్ కుమార్ స్పందించారు… ఓ మై గాడ్.. అందరూ ఈ ఫోటోతో నన్ను పోల్చుతున్నారు.. అంటూ కామెంట్స్ చేసారు. ఏదేమైనా మరోసారి నటి వనిత విజయ్ కుమార్ పేరు సోషల్ మీడియాలో మరోసారి నానుతోంది. Vanitha Vijay Kumar

ట్వీట్స్..

Also Read: సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో రామ్ గోపాల్ వర్మ సోదరుడు మృతి.. సంతాపం తెలిపిన బోనీ కపూర్…

S. Thaman: గోపీచంద్ మలినేని సినిమాకు సంగీతదర్శకుడు ఫిక్స్.. బాలయ్య సినిమాకు బద్దలయ్యే మ్యూజిక్ ఇవ్వనున్న తమన్..

Anasuya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆకాశానికెత్తేసిన రంగమ్మత్త.. ఆయన అంకితభావం కలిగి ఉన్న స్టార్ అంటూ..