S. Thaman: గోపీచంద్ మలినేని సినిమాకు సంగీతదర్శకుడు ఫిక్స్.. బాలయ్య సినిమాకు బద్దలయ్యే మ్యూజిక్ ఇవ్వనున్న తమన్..

బాలయ్య బొమ్మకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ పడనుంది. ఈ సింహం తొడకొట్టి.. మీసం మెలేయడమే ఆలస్యం.. డాల్బిసిస్టం బద్దలయ్యేలా...

S. Thaman: గోపీచంద్ మలినేని సినిమాకు సంగీతదర్శకుడు ఫిక్స్.. బాలయ్య సినిమాకు బద్దలయ్యే మ్యూజిక్ ఇవ్వనున్న తమన్..
Thaman
Follow us
Rajeev Rayala

|

Updated on: May 23, 2021 | 8:03 PM

S. Thaman:

బాలయ్య బొమ్మకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ పడనుంది. ఈ సింహం తొడకొట్టి.. మీసం మెలేయడమే ఆలస్యం.. డాల్బిసిస్టం బద్దలయ్యేలా… మన ఒంటి మీదున్న రోమాలు నిక్కపొడిచేలా.. బీజీఎం ప్లే అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకలా అంటే.. ఆ రేంజ్లో దంచికొట్టే మ్యూజిక్ డైరెక్టర్ బాలయ్య నెక్ట్‌ సినిమాకు సైన్‌ చేశారు కాబట్టి! బాలయ్య హీరోగా గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కితున్న చిత్రానికి మ్యూజిక్  డైరెక్టర్ ఫిక్స్‌ అయ్యారు. వరుసగా మ్యూజికల్‌ హిట్లతో… సినిమాకు హైప్‌నిచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో దూసుకుపోతున్న తమన్‌ అయితేనే…  ఈ సబ్జెక్ట్‌కు సూట్‌ అవుతాడని డైరెక్టర్‌ గోపీచంద్‌ భావించారట. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా స్టోరీ నరేట్‌ చేసి ఈ బిజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ను లాక్‌ కూడా చేసేశారట గోపీ. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.

ఇక తమన్‌ క్రాక్‌ సినిమలో పోతురాజు వీరశంకర్‌ అలియాస్‌ రవితేజ్‌ హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్‌ ఆ సినిమా సక్సెస్‌కి చాలా ప్లస్‌ అయ్యారు. అంతేకాదు తమన్‌ ప్రస్తుతం బోయాపాటి డైరెక్షన్లో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న బీబీ3 సినిమాకు కూడా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చేస్తున్నారు. ఇక ఇప్పటికే బీబీ3 టీజర్‌లోని బాలయ్య ఫైట్ కమ్‌ డైలాగ్‌కు.. తమన్‌ బీజీఎమ్ తోడై… యూట్యూబ్‌ను షేక్‌ చేసింది. ఇక ఈ సినిమాతో తమన్‌ ఇంకెలాంటి బీజీఎమ్లు ఇస్తారో చూడాలి మరి.

మరిన్ని ఇక్కడ చదవండి

kajal agarwal : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చందమామ..అందం – అభినయంలో తనకు తానే సాటి అనేంతలా..

Anasuya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆకాశానికెత్తేసిన రంగమ్మత్త.. ఆయన అంకితభావం కలిగి ఉన్న స్టార్ అంటూ..

The Family Man 2 controversy: ఫామిలీ మ్యాన్ – 2 సరికొత్త కష్టాలు.. వెబ్ సిరీస్ రద్దు చేయాలని కేంద్ర మంత్రికి లేఖ..