The Family Man 2 controversy: ఫామిలీ మ్యాన్ – 2 సరికొత్త కష్టాలు.. వెబ్ సిరీస్ రద్దు చేయాలని కేంద్ర మంత్రికి లేఖ..

అక్కినేని సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదంలో చికుక్కున్న విషయం తెలిసిందే. సినిమాల్లో హీరోయిన్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న సమంత..

The Family Man 2 controversy: ఫామిలీ మ్యాన్ - 2 సరికొత్త కష్టాలు.. వెబ్ సిరీస్ రద్దు చేయాలని కేంద్ర మంత్రికి లేఖ..
The Family Man 2
Follow us
Rajeev Rayala

|

Updated on: May 23, 2021 | 5:19 PM

The Family Man 2 controversy: అక్కినేని సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదంలో చికుక్కున్న విషయం తెలిసిందే. సినిమాల్లో హీరోయిన్ గా స్టార్ డమ్ తెచ్చుకున్న సమంత చేయకచేయాక చేసిన ఒక్క వెబ్ సిరీస్ కూడా ఇలా తలనొప్పిగా మారడంతో సామ్ అభిమానులు నిరాశ పడుతున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. ఈ సిరీస్ కోసం ప్రేక్షకులుగా ఎంతగానో ఎదురుచూశారు. ఇక వారి ఎదురుచూపులకు విముక్తి కలిగిస్తూ.. మే 19న మేకర్స్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ట్రైలర్ విడుదల చేసారు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్ శ్రీకాంత్ తివారీ అనే పోలీస్ పాత్రలో నటించగా.. సమంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్రలో నటించింది. అయితే ఇందులో తమ ఉగ్రవాది పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక అన్ని సజావుగా ఉన్న సమయంలో సమంతకు అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. ఈ ట్రైలర్ చూసిన తమిళియన్స్ సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా ఫామిలీ మ్యాన్ – 2 వెబ్ సిరీస్ రద్దు చేయాలనీ ఎండీఎంకే నేత ఎంపీ వైకో  డిమాండ్ చేసారు. ఈమేరకు ఆయన కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కి లేఖ రాసారు. తమిళులను తీవ్రవాదులు గా చూపించే ప్రయత్నం చేస్తున్న ఫామిలీ మ్యాన్ – 2 వెబ్ సిరీస్ ని వెంటనే రద్దు చేయాలిని ఆ లేఖలో కోరారు. అలాగే తమిళనాడు కి చెందిన సినీ నటి సమంత , తమిళ సంప్రదాయాలను , తమిళుల మనోభావాలను కించపరిచే ఇటువంటి వెబ్ సిరీస్ లలో నటించడం బాధాకరం అన్నారు . తమిళుల మనోభావాలను కించపరిచేలా ఉన్న సంభాషణలు , సన్నివేశాలను ,చిత్రీకరించిన వారి ఫై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక ఈలం కోసం జరిగిన పోరాటాలను తమ ఆదాయం కోసం వక్రీకరిస్తే మేము చూస్తూ ఊరుకోమని, వెబ్ సిరీస్ వెంటనే రద్దు చేయకపోతే ఎటువంటి పోరాటాలకు మేము సిద్ధం గా ఉన్నామంటు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కి ఎండీఎంకే నేత ఎంపీ వైకో లేఖ రాసారు. ఈ వివాదం పై కేంద్ర మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

kajal agarwal : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చందమామ..అందం – అభినయంలో తనకు తానే సాటి అనేంతలా..

Pelli Sandadi: రాఘవేంద్రరావు ‘పెళ్ళిసందడి’ నుంచి మరో సాంగ్.. మాస్ మసాలా పాటతో..

Keerthy Suresh: కేరళ యువరాణిగా మారిన  కీర్తిసురేష్..  సూపర్ స్టార్ సినిమాలో ఆ పాత్రలో కీర్తి.. ఫోటో వైరల్..