AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pelli Sandadi: రాఘవేంద్రరావు ‘పెళ్ళిసందడి’ నుంచి మరో సాంగ్.. మాస్ మసాలా పాటతో..

దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు పుట్టిన రోజు నేడు..ఎన్నో విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన రాఘవేంద్రరావు తెలుగు సినిమా చరిత్రపై తనదైన ముద్ర వేశారు.

Pelli Sandadi: రాఘవేంద్రరావు 'పెళ్ళిసందడి' నుంచి మరో సాంగ్.. మాస్ మసాలా పాటతో..
Rajeev Rayala
|

Updated on: May 23, 2021 | 3:15 PM

Share

Pelli Sandadi: దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు పుట్టిన రోజు నేడు..ఎన్నో విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన రాఘవేంద్రరావు తెలుగు సినిమా చరిత్రపై తనదైన ముద్ర వేశారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న దర్శకేంద్రుడు. రాఘవేంద్రరావును నేటి తరం దర్శకులు చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు. అందుకే ఆయన దర్శకేంద్రుడు అయ్యారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాఘవేంద్రరావు. రాఘవేంద్ర రావు చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కస్తున్న సినిమా పెళ్ళిసందడి. గతంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్ళిసందడి’ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ నటించిన ‘పెళ్ళిసందడి’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో  ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పడు దర్శకేంద్రుడు తెరకెక్కిస్తున్న’పెళ్ళిసందడి’లో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రం నుంచి `బుజ్జులు బుజ్జులు` సాంగ్ రిలీజైంది. రాఘవేంద్రరావు పర్యవేక్షణ అన్నందుకు ఆయన మార్క్ ఈ పాటలో స్పష్ఠంగా కనిపిస్తోంది.  ఇక ఈ సాంగ్ ఆద్యంతం రోషన్ ఛామ్ వైబ్రేంట్ పెర్ఫామెన్స్.. కథానాయిక లీలా ఎనర్జిటిక్ డ్యాన్సులు అందచందాలు మైమరిపిస్తున్నాయి. పాటకు ఎంచుకున్న బ్యాక్ గ్రౌండ్ .. కీరవాణి సంగీతం కూడా ప్రధాన అస్సెట్ గా నిలవనున్నాయి. చంద్ర బోస్ పాటను రచించగా.. బాబా సైగల్- మంగ్లీ ఆలపించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

కేరళ యువరాణిగా మారిన  కీర్తిసురేష్..  సూపర్ స్టార్ సినిమాలో ఆ పాత్రలో కీర్తి.. సోషల్ మీడియాలో వైరలవుతున్న  ఫోటో..

Karthika Deepam: దీప కోసం మొదటి సారి ఏడ్చిన కార్తీక్.. అందుకు మా అమ్మ సంతోషంగా ఉంది.. కార్తీక దీపంపై మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్..

Heroine Radhika Apte : ఒక్క సినిమాకు నాతో డబుల్ వర్క్ చేయించారు.. సంచలన కామెంట్లు చేసిన హీరోయిన్..