AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: కేరళ యువరాణిగా మారిన  కీర్తిసురేష్..  సూపర్ స్టార్ సినిమాలో ఆ పాత్రలో కీర్తి.. ఫోటో వైరల్..

'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులతోపాటు.. దర్శక నిర్మాతలు సైతం ఫిదా అయిపోయారు.

Keerthy Suresh: కేరళ యువరాణిగా మారిన  కీర్తిసురేష్..  సూపర్ స్టార్ సినిమాలో ఆ పాత్రలో కీర్తి..  ఫోటో వైరల్..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: May 23, 2021 | 3:15 PM

Share

‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులతోపాటు.. దర్శక నిర్మాతలు సైతం ఫిదా అయిపోయారు. దీంతో తెలుగు పరిశ్రమలో కీర్తి సురేష్ కు ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు టాలీవుడ్ బడా హీరోలందరితో కలిసి నటించింది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఇటు తెలుగులో కాకుండా.. అటు తమిళం, మలయాళం సినిమాల్లో కూడా కీర్తి నటిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మరక్కర్‌: లయన్‌ ఆఫ్‌ ది అరేబియన్‌ సీ’ సినిమాలో నటిస్తోంది కీర్తి. తాజాగా ఈ సినిమాలోని కీర్తికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంగీతకారిణిగా జీవితాన్ని మొదలు పెట్టి కేరళ యువరామిగా పట్టాభిషిక్తురాలైన యువతిగా కీర్తి పాత్ర కొనసాగనున్నట్లుగా టాక్. ఒంటినిండా ఆభరణాలు ధరించి రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో వీణ వాయిస్తున్నట్లు ఉన్న తన స్టిల్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు కేరళ యువరాణిగా కీర్తి అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరక్కల్‌ మూవీ విడుదలకు ముందే మూడు విభాగాల్లో(ఉత్తమ చిత్రం, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌) జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహి్స్తున్నాడు. అయితే ఈ సినిమా గతేడాది మార్చి 26న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను ఓనమ్‌ పండగ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు ఇటీవల మోహన్‌లాల్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్‌ మోహన్‌లాల్‌ (మోహన్‌లాల్‌ తనయుడు) కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: సినీ జీవితం చాలా నేర్పించింది… నమ్మకద్రోహులకు దూరంగా ఉండటమే కాదు.. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి.. చంద్రమోహన్..

Karthika Deepam: దీప కోసం మొదటి సారి ఏడ్చిన కార్తీక్.. అందుకు మా అమ్మ సంతోషంగా ఉంది.. కార్తీక దీపంపై మంచు లక్ష్మీ ఆసక్తికర ట్వీట్..