రామ్ చరణ్- శంకర్ మూవీ క్రేజీ అప్ డేట్.. మరోసారి చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ.. ఫైనల్ చేసిన చిత్రయూనిట్ ?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో

రామ్ చరణ్- శంకర్ మూవీ క్రేజీ అప్ డేట్.. మరోసారి చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ.. ఫైనల్ చేసిన చిత్రయూనిట్ ?
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2021 | 3:03 PM

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తుండగా.. ఇటీవల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతున్న ప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రతిసారి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. తాజాగా మారోసారి చరణ్- శంకర్ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. Director Shankar

వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు టాక్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై  టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజ్ నిర్మించనున్నారు.  భారీ బడ్జెట్‌ కేటాయించి, భారీ తారాగణంతో విజువల్ వండర్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజ్. అంతేకాకుండా.. ప్రేక్షకులకు ఓ వినూత్న అనుభూతినిచ్చేలా 3D ఫార్మాట్‌లో రూపొందించనున్నారట. అయితే ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను సెలక్ట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకు హీరోయిన్‌గా కియారా అద్వానీని తీసుబోతున్నట్లు టాక్ రాగా తాజాగా అలియా భట్ పేరు తెరపైకి రావడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే అలియా.. ఆర్ఆర్ఆర్ సినిమాలో చెర్రీకి జోడిగా నటిస్తోంది. ఇక ఇదే నిజమైతే.. అలియా తెలుగులో వరుసగా రెండు పాన్ ఇండియా సినిమాలతో ఎంట్రీ ఇవ్వనుంది.

Also Read: Black Fungus: బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే కరోనా నుంచి కోలుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. సూచిస్తున్న దంతవైద్యులు..

Ramdev Baba : అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్ దేవ్ బాబా.. మండిపడుతున్న వైద్య సంఘాలు..

Black Fungus: కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగ‌స్‌కు చికిత్స విధాన‌మే కార‌ణ‌మా.? నిపుణులు ఏం చెబుతున్నారు..

Weight Loss Exercises : బరువు తగ్గడానికి, బెల్లీఫ్యాట్‌ కరగడానికి ఈ నాలుగు ఎక్సర్‌సైజ్‌లు సూపర్..! ట్రై చేసి చూడండి..