Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెండి తెరపై దర్శకేంద్రుడి ఒక్కో చిత్రం ఒక్కో కళా ఖండం.. తెలుగు సినీ చరిత్రలో అర్ధశతాబ్ధం తనదే..

K.Raghavendra Rao: కోవెలమూడి రాఘవేంద్రరావు.. తెలుగు సినీ చరిత్రలో ఆయనో చరిత్ర. హీరోహీరోయిన్లను పరిచయం  చేయడం దగ్గర నుంచి పాటలు,

వెండి తెరపై దర్శకేంద్రుడి ఒక్కో చిత్రం ఒక్కో కళా ఖండం.. తెలుగు సినీ చరిత్రలో అర్ధశతాబ్ధం తనదే..
Raghavendra Rao
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2021 | 12:38 PM

K.Raghavendra Rao: కోవెలమూడి రాఘవేంద్రరావు.. తెలుగు సినీ చరిత్రలో ఆయనో చరిత్ర. హీరోహీరోయిన్లను పరిచయం  చేయడం దగ్గర నుంచి పాటలు, ముగింపు ప్రతి సన్నివేశం ప్రతిదీ విభిన్నమే. దర్శకేంద్రుడి సినిమాలో నటించాలనేది ప్రతి ఒక్క నటీనటుల కళ. దర్శకేంద్రుడి సినీ చరిత్రలో ఎన్నో అపురూప చిత్రాలు.. సూపర్ హిట్స్. పువ్వులు, పండ్లు.. సంగీత వాయిద్యాలను ఇలా ప్రతి వస్తువు ఆయన సినిమా కోసం మరింత అందంగా ముస్తాబైపోతాయి. ఇక రాఘవేంద్రరావు చిత్రాల్లోని పాటలు ఇప్పటికీ శ్రోతలను పరవశింపచేస్తాయి. ప్రేమ కథ చిత్రాల నుంచి ఆధ్యాత్మిక చిత్రాల వరకు అన్ని ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చిత్రీకరించడంలో ఆయనే ప్రత్యేకం. ఇక అన్నమయ్య’ చిత్రం తీసి జనాన్ని మెప్పించిన రాఘవేంద్రుడు ఆ కవిపుంగవునిలాగే ఓ వైపు శృంగారాన్ని, మరోవైపు ఆధ్యాత్మికతను ప్రదర్శించారనిపిస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగున్నర దశాబ్ధాలకు పైగా దర్శకుడిగా కెరీర్ కొనసాగించిన ఘనత రాఘవేంద్రుడికే చెల్లింది. ఇవాళ మే23న రాఘవేంద్రరావు పుట్టిన రోజు.

రాఘవేంద్రరావు, కీరవాణి కలిస్తే సినీగీతాలు అద్భుతంగా వస్తాయన్నది అనేక పర్యాయాలు నిరూపితమైంది. 1991లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుందరాకాండ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత శోభన్ బాబు, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా నటించిన దేవత సినిమా లో ‘వెల్లువొచ్చి గోదారమ్మ’పాట వినూత్నంగా చిత్రీకరించారు రాఘవేంద్రరావు. చక్రవర్తి సంగీతం, బాలు సుశీల స్వరాలు, శోభన్, శ్రీదేవి అభినయం వేటికవేపోటీపడ్డాయి అనుకోవచ్చు. బిందెల నడుమ చిత్రీకరించిన ఈ పాట తర్వాత అనేకమంది దర్శకులకు స్ఫూర్తినిచ్చింది. ఆయన సినిమాల కంటే.. పాటలకే ఎక్కువగా ఖర్చు చేసేవారు. ఆయన తొలి చిత్రం ‘బాబు’ తరువాత తెరకెక్కించిన “జ్యోతి, కల్పన, ఆమెకథ” వంటి సినిమాలు తక్కువ బడ్జెట్ తో రూపొందినవే. ‘అడవిరాముడు’ తరువాత కూడా “ప్రేమలేఖలు, పదహారేళ్ళ వయసు, రాధాకృష్ణ, నిండు నూరేళ్ళు, నిప్పులాంటి నిజం, సత్యభామ” వంటి చిత్రాలను తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించారు. “బొబ్బిలిబ్రహ్మన్న, అల్లరి ప్రియుడు, పెళ్ళిసందడి, అన్నమయ్య” చిత్రాలతో ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు సార్లు నంది అవార్డు అందుకున్న దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రమే. ‘పెళ్ళిసందడి’తో బెస్ట్ కొరియోగ్రాఫర్ గానూ నందిని అందుకున్నారు. అలాగే 2009లో బి.యన్.రెడ్డి నేషనల్ అవార్డును అందుకున్నారు. 2015 సంవత్సరానికిగాను ఆయనకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రకటించారు. ఇక “ప్రేమలేఖలు, జగదేకవీరుడు – అతిలోకసుందరి, అల్లరిప్రియుడు, అన్నమయ్య” చిత్రాల ద్వారా ఉత్తమ దర్శకునిగా ఫిలిమ్ ఫేర్ అవార్డునూ సొంతం చేసుకున్నారు.

Also Read: సినీ జీవితం చాలా నేర్పించింది… నమ్మకద్రోహులకు దూరంగా ఉండటమే కాదు.. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి.. చంద్రమోహన్..

Allu Arjun: అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు… 400 మిలియన్ లైక్స్ సాధించిన బుట్ట బొమ్మ సాంగ్