Shahrukh Khan: మ‌రో కొత్త అవతార‌మెత్తనున్న బాలీవుడ్ బ‌ద్‌షా..! ఓటీటీని ఒడిసిప‌ట్టుకుంట‌న్న షారుఖ్‌..

Shahrukh Khan: షారుఖ్ ఖాన్.. ఇండియ‌న్ సినీ ప్ర‌పంచానికి ఈ పేరును ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. చిన్న న‌టుడిగా కెరీర్ మొద‌లు పెట్టిన షారుఖ్ బాలీవుడ్ బాద్‌షాగా ఎదిగారు...

Shahrukh Khan: మ‌రో కొత్త అవతార‌మెత్తనున్న బాలీవుడ్ బ‌ద్‌షా..! ఓటీటీని ఒడిసిప‌ట్టుకుంట‌న్న షారుఖ్‌..
Shahrukh Khan
Follow us
Narender Vaitla

|

Updated on: May 24, 2021 | 4:03 PM

Shahrukh Khan: షారుఖ్ ఖాన్.. ఇండియ‌న్ సినీ ప్ర‌పంచానికి ఈ పేరును ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. చిన్న న‌టుడిగా కెరీర్ మొద‌లు పెట్టిన షారుఖ్ బాలీవుడ్ బాద్‌షాగా ఎదిగారు. వ‌రుస హిట్ సినిమాల్లో న‌టించి బాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు. రూ. వేల కోట్ల అధిప‌తిగా మారారు. ఇక కేవ‌లం సినిమాల‌కే పరిమితం కాకుండా ఐపీఎల్ టీమ్ కొనుగోలు వంటి వాటితో త‌న‌లోని బిజినెస్ మ్యాన్‌ను కూడా బ‌య‌పెట్టారు షారుఖ్‌. అయితే ఇటీవ‌లి కాలంలో షారుఖ్ హీరోగా న‌టించిన సినిమాలు బాక్సాఫీస్ ముందు పెద్ద‌గా ఆడ‌టం లేదు. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన జీరో చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌డంతో గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ బాద్‌షా.. ప్ర‌స్తుతం ప‌ఠాన్ సినిమాలో న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే షారుఖ్ తాజాగా ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తాను న‌టించ‌కుండా నిర్మాత‌గా ప‌లు వెబ్ సిరీస్‌ల‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. షారుఖ్ సొంత ప్రొడ‌క్ష‌న్ కంపెనీ.. రెడ్ చిల్లీస్ ద్వారా వెబ్ సిరీస్‌ల‌ను తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డ‌ట్లు స‌మాచారం.ఇందుకోసం ఈయ‌న ఇప్ప‌టికే ప‌లు క‌థ‌ల‌ను ఒకే చేశార‌ని.. 2021 చివ‌రిక‌ల్లా రెడ్ చిల్లీస్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌పై షారుఖ్ నిర్మించిన వెబ్ సిరీస్‌లు విడుద‌ల కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నారు. మ‌రి షారుఖ్ ఓటీటీ రంగంలో ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తారో వేచి చూడాలి.

Also Read: Chiranjeevi Konidela: “తోడ బుట్టిన బ్రదర్స్ కి రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే!”: చిరంజీవి

Priyanka Arul Mohan: అక్కినేని యంగ్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్.. ఏ సినిమాలో అంటే..

Pushpa Movie: ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్… అల్లు అర్జున్ కోసం అదిరిపోయే సాంగ్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!