Anasuya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆకాశానికెత్తేసిన రంగమ్మత్త.. ఆయన అంకితభావం కలిగి ఉన్న స్టార్ అంటూ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Anasuya :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆకాశానికెత్తేసిన రంగమ్మత్త.. ఆయన అంకితభావం కలిగి ఉన్న స్టార్ అంటూ..
Anasuya
Follow us
Rajeev Rayala

|

Updated on: May 23, 2021 | 4:00 PM

Anasuya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుష్ప అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. బన్నీకి జోడీగా రష్మిక మందన నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ పుష్ప లో గిరిజన యువతిగా నటిస్తుందని తెలుస్తుంది. ఆగస్టు 13న రిలీజ్ డేట్ అనుకున్నా.. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనన్న క్లారిటీకొచ్చేశారు మేకర్స్. సేమ్ టైం… సినిమా కంటెంట్ విషయంలో కూడా మేజర్ డెసిషన్ తీసుకున్నారట‌. పుష్ప1 అండ్ పుష్ప2.. ఇలా సినిమాను రెండు భాగాలుగా విడగొట్టాలన్నది సుక్కూ వేసిన న్యూ ఐడియా అని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. ఇప్పటివరకు 70 పర్సెంట్ షూటింగ్ ముగిసిందని… ఆ రషెస్ తో ఫస్ట్ పార్ట్ ని కంక్లూడ్ చేసి ఆక్టోబర్ 13న రిలీజ్ చేయాలన్నది తాజా ప్లాన్ అట‌. మిగతా పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేసేలా స్కెచ్ రెడీ చేశారని టాక్‌. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రలో అందాల యాంకర్ అనసూయ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆమధ్య సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’లో ఆమె చేసిన ‘రంగమ్మత్త’  గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్. అంతలా మెప్పించింది అనసూయ. ‘పుష్ప’ సినిమాలోనూ ఆమెకి మంచి పాత్ర పడింది. అనసూయ ఈ సినిమా షూటింగులో పాల్గొంది కూడా. అయితే ఇప్పుడు సినిమాలో అనసూయ పాత్ర నిడివిని పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. మొదటిభాగంలోను .. రెండవ భాగంలోను ఆమె కనిపిస్తుందన్న మాట. అయితే కొద్దిరోజుల చిత్రీకరణ అనంతరం కోవిడ్ ఉధృతి వల్ల సెట్లో బన్నీకి కోవిడ్ సోకడంతో షూటింగ్ ని వాయిదా వేశారు. బన్ని కోవిడ్ కి చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసిందే. తాజా చిట్ చాట్ లో అనసూయ మాట్లాడుతూ పుష్ప సెట్లో ఉన్న నాలుగు రోజుల్లోనే అల్లు అర్జున్ వ్యక్తిత్వంతో ప్రేమలో పడిపోయానని అంటున్నారు. బన్ని చేసే పని పట్ల  నిబద్ధత అంకితభావం కలిగి ఉన్న స్టార్ అని చెప్పుకొచ్చింది అనసూయ. రెండవ సారి సుకుమార్ తో పని చేస్తున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ సరదాగా ఉంటుందని అంటుంది అనసూయ.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pelli Sandadi: రాఘవేంద్రరావు ‘పెళ్ళిసందడి’ నుంచి మరో సాంగ్.. మాస్ మసాలా పాటతో..

రామ్ చరణ్- శంకర్ మూవీ క్రేజీ అప్ డేట్.. మరోసారి చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ.. ఫైనల్ చేసిన చిత్రయూనిట్ ?

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..