AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో రామ్ గోపాల్ వర్మ సోదరుడు మృతి.. సంతాపం తెలిపిన బోనీ కపూర్…

Ram Gopal Varma: గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు... అనారోగ్యంతో మరణించిగా..

సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో రామ్ గోపాల్ వర్మ సోదరుడు మృతి.. సంతాపం తెలిపిన బోనీ కపూర్...
Somashekar
Rajitha Chanti
| Edited By: Rajeev Rayala|

Updated on: May 24, 2021 | 8:37 PM

Share

Ram Gopal Varma: గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు… అనారోగ్యంతో మరణించిగా.. మరికొందరు కరోనా మహమ్మారికి బలయ్యారు. తాజాగా మరో కరోనాతో మరో సినీ ప్రముఖుడు మరణించారు. నిర్మాత, దర్శకుడు అయిన పి. సోమశేఖర్ మరణించారు. ఈయన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వరుసకు సోదురుడు అవుతారు. ఆయన పలు సినిమాలకు కూడా పనిచేశారు. రంగీలా, దౌడ్, సత్య కంపెనీ సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హిందీలో ముస్కురాకే దేఖ్ జరా అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఆయన ఇతర వ్యాపారాల్లోకి వెళ్లడంతో చాలాకాలంగా రామ్ గోపాల్ వర్మకు దూరంగా ఉంటున్నారు. తన జీవితంలో కీలకమై వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని.. అతడిని చాలా మిస్ అవుతున్నానని ఆర్జీవి అంటుండేవారు. p. Somashekar

సత్య సినిమా చిత్రీకరణ సమయంలో ఆర్జీవీ కంటే సోమశేఖర్ ను చూస్తేనే ఎక్కువగా భయం వేసేదని.. ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సోమశేఖర్ మృతిపై బోనీ కపూర్ స్పందిస్తూ.. సోమశేఖర్ మరణ వార్త విని ఎంతో షాక్ అయ్యాను అన్నారు. సోమశేఖర్ మృతి పై పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: PF Balance: SMS, మిస్డ్ కాల్ ద్వారా ఇక నుంచి సులభంగానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చెయోచ్చు.. ఎలాగంటే..

NEFT Users: ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ చేసే వారు ఓ సారి ఈ వార్త చ‌ద‌వండి.. ఈ రోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఈ సేవలు ఉండ‌వు.

ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. సర్వీస్ చార్జీలను తగ్గింపు చేసిన బ్యాంక్.. ఇక వారికి బెనిఫిట్..