ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. సర్వీస్ చార్జీలను తగ్గింపు చేసిన బ్యాంక్.. ఇక వారికి బెనిఫిట్..
దేశంలోని దిగ్గజ బ్యాంకులలో ఒక్కటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. తమ కస్టమర్ల కోసం ఈ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలోని దిగ్గజ బ్యాంకులలో ఒక్కటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు శుభవార్త అందించింది. తమ కస్టమర్ల కోసం ఈ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్.. సర్వీస్ చార్జీలను తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. బ్యాంక్ కస్టమర్లు ఇక పై డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు తక్కువ చార్జీలు చెల్లిస్తే.. సరిపోతుంది. ఇంటి వద్దకే క్యాష్ పొందాలనుకుంటే.. రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. అయితే గతంలో ఈ చార్జీలు రూ. 60 నుంచి రూ. 100 వరకు ఉండేవి. పీఎన్బీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది.
పీఎన్బీ విడుదల చేసిన సమాచారం ప్రకారం డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలో డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే కేవలం రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు మినహాయింపు మే, జూన్ నెలలకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే డబ్బులు విత్ డ్రా చేసుకునేవారికి నెలకు రెండుసార్లు రూ. 50 చెల్లించాలి. ఈ సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చు. కనీస పరిమితి రూ. 1000 కాగా.. గరిష్ట పరిమితి రూ. 10,000 Aeps (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) లేదా డెబిట్ కార్డ్ ద్వారా దీనిని పొందవచ్చు. ఇందుకోసం మొబైల్ ఓటీపీ ద్వారా లేదా ల్యాప్ టాప్ , కంప్యూటర్ ద్వారా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలకు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ సేవల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. 1800-1037-188 లేదా 1800-1213-721 నెంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. డీఎస్‌బీ మొబైల్ యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ముందుగా మీరు డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనువర్తనానికి లాగిన్ కావాలి. ఆ తర్వాత మీ బ్యాంకును ఎంచుకోవాలి. అప్పుడు మీ అకౌంట్ నంబర్, పిన్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ కు ఓటీపీ నంబర్ వస్తుంది. దానిని ఫిల్ చేయాలి. ఇప్పుడు మీ అనువర్తనంలో బ్యాంక్ పేరు, అకౌంట్ నంబర్, శాఖ పేరు మొదలైనవి సెలక్ట్ చేసుకోవలి. విత్ డ్రా ఆప్షన్ వస్తుంది. పిక్ అప్, డ్రాప్ అప్ కోసం మీ ప్రస్తుత అడ్రస్ ఎంటర్ చేయాలి. మీ అడ్రస్ నుంచి 10 కి.మీ లోపల ఉన్న బ్రాంచులు మీకు కనిపిస్తాయి. అందులో ఒక బ్రాంచును ఎంచుకోవడం ద్వారా మీరు డబ్బు విత్ డ్రా కోసం స్లాట్ సెలక్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీకు సర్వీస్ చార్జీ కనిపిస్తుంది. ఓకే సెలక్ట్ చేసుకున్న తర్వాత మీకు మొబైల్ కి మెసేజ్ వస్తుంది. అందులో మీ ఇంటికి వచ్చే ఎంప్లాయి పేరు, వివరాలు ఉంటాయి.
ట్వీట్..
Announcement ?
In view of the Pandemic, cash withdrawal service through Doorstep Banking has been reduced to Rs 50. For more information, log on to: https://t.co/wArxNqERSM
Now stay in & stay safe! pic.twitter.com/lh0IJhxITA
— Punjab National Bank (@pnbindia) May 20, 2021
Also Read: లోన్ తీసుకున్నవారికి హెచ్చరిక.. టైమ్‌కు EMI కట్టకపోతే ఇక అంతే సంగతులు. .. భారీగా ఛార్జీలు..