Puri Jagannadh: ప్రపంచం నాశనమై పోయినా మన దగ్గర మాత్రం వేడి వేడి చికెన్ రైస్ రెడీగా ఉంటుంది”: పూరీజగన్నాథ్
ఎమర్జెన్సీ ఫుడ్ గురించి మీకు తెలుసా..? 25 సంవత్సరాలు పాడయిపోకుండా ఉండే ఫుడ్ గురించి మీరెప్పుడైన విన్నారా.. ?
Puri Jagannadh: ఎమర్జెన్సీ ఫుడ్ గురించి మీకు తెలుసా..? 25 సంవత్సరాలు పాడయిపోకుండా ఉండే ఫుడ్ గురించి మీరెప్పుడైన విన్నారా.. ? ఒక వేళ వినకుంటే విని తీరాల్సిందే.. వీలైతే అలాంటి ఫుడ్‌ను మన ఇంటికి తెచ్చుకోవాల్సిందే.. అని అంటున్నారు పూరీ. ఎవరికీ చెప్పకుండా ఉన్నట్టుండి ఊడిపడే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆహారమే కడుపునింపుతుంది. మనల్ని బతికేలా చేస్తుందని పూరి తన “పూరీ మ్యూజింగ్స్” ద్వారా అందరికీ చెబుతున్నారు. “వరదలు రావొచ్చు.. యుద్ధాలు రావొచ్చు.. సునామీలో చిక్కుకుపోవచ్చు.. లేదా ప్రస్తుతం మనం చూస్తున్న ఇలాంటి పాండమిక్ లాంటిది ఏదో ఒకటి వచ్చి లాక్‌డౌన్ పెట్టేలా చేయోచ్చు. ఏదో దరిద్రం జరిగి ఒక నెల పాటు కరెంట్ పోవచ్చు. క్యాంపింగ్‌కి వెళ్లినప్పుడు వెహికిల్ పాడైపోయి మిడిల్ ఆఫ్ ది జంగల్ ఇరుక్కుపోవచ్చు. అలాంటి సమయంలో మనల్ని మనం సంరక్షించుకోవడం కోసమే ఎమర్జెన్సీ ఫుడ్ రెడీ చేశారు” అని పూరీ వివరించారు.
కేవలం ఒక కప్పు వేడి నీళ్లు కలిపి ఆ ఫుడ్ ని నేరుగా తినేయవచ్చుని.. వండాల్సిన అవసరం లేదని పూరి అన్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంఛ్, డిన్నర్ చొప్పున ఒక నెలకు సరిపడా ఫుడ్ ప్యాకెట్స్‌తో బకెట్స్ అందుబాటులో ఉంటాయిని ఆయన అన్నారు. అలాగే రెండు రోజులకు సరిపడే ఫుడ్ ప్యాకెట్స్ కూడా మార్కెట్లో దొరుకుతాయని పూరీ అన్నారు. బార్లీ, కినోవా, ఓట్స్, న్యూడిల్స్, పాస్తా లాంటి ఫుడ్ ఐటమ్స్‌ని… ఒక బకెట్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే పాతికేళ్లలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చని ఆయన సూచించారు. అంతేకాకుండా ఈ ఎమర్జెన్సీ ఫుడ్‌లో సూప్స్, చికెన్ నూడిల్స్, పాస్తా… ఇలా ఏది కావాలంటే అది మీరు కొనుగోలు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఎక్కవగా ఇలాంటి ఫుడ్‌ను మిలటరీ వాళ్లు వాడతారన్నారు. అలాగే వాళ్లు బంకర్లలో కూడా ఇలాంటివి స్టాక్ పెట్టుకుంటారని చెప్పారు. నా దగ్గర ఓ బకెట్ ఉంది.. మీరు కూడా ఓ బకెట్ తెచ్చి పెట్టుకోండని పూరీ సూచించారు. “ప్రపంచం నాశనమై పోయినా మన దగ్గర మాత్రం వేడి వేడి చికెన్ రైస్ పాస్తా రెడీగా ఉంటాయి” అని చివర్లో పూరీ చమత్కరించారు.
మరిన్ని ఇక్కడ చదవండి :