AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi, Ali : పేదలకు అండగా నిలుస్తున్న చిరంజీవి, అలీ.. కరోనా కష్టకాలంలో నిత్యావసరాల పంపిణీ..

Chiranjeevi, Ali : కరోనా పేదల బతుకులను అతలాకుతలం చేస్తున్నది. లాక్‌డౌన్ వల్ల పని లేకపోవడంతో పస్తులుండాల్సిన

Chiranjeevi, Ali : పేదలకు అండగా నిలుస్తున్న చిరంజీవి, అలీ.. కరోనా కష్టకాలంలో నిత్యావసరాల పంపిణీ..
Ali
uppula Raju
|

Updated on: May 23, 2021 | 11:07 PM

Share

Chiranjeevi, Ali : కరోనా పేదల బతుకులను అతలాకుతలం చేస్తున్నది. లాక్‌డౌన్ వల్ల పని లేకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయి. అలాంటి వారిని చూస్తున్న మంచి మనసున్న వ్యక్తులు మేమున్నామంటు ముందుకొస్తున్నారు. తాజాగా సినీ నటుడు అలీ కుటుంబ సమేతంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. త‌న స‌తీమ‌ణి జుబేదాతో క‌లిసి తెలుగు సినిమా ఉమెన్ ప్రొడ‌క్షన్ యూనియ‌న్‌కి చెందిన 130 మందికి నిత్యావ‌స‌రాలు అందించారు.

మరోవైపు అగ్రహీరో చిరంజీవి సైతం నిత్యం పేదలకు అండగా నిలుస్తున్నారు. తనవంతు సాయం చేసి ఆదుకుంటున్నారు. ఇప్పటికే ప‌లువురు న‌టులు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి సేవ‌లు అందించిన కుటుంబాల‌కు చేయూత‌నిచ్చారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న భ‌ర‌త్ భూష‌ణ్ అనే ఫొటో జ‌ర్నలిస్టుకి ఆదివారం రూ.50వేలు సాయం అందించి త‌న సేవాగుణం చాటుకున్నారు.

ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి ముందుకు వచ్చారు. ఫిలింనగర్‌లోని సీవీఆర్‌ న్యూస్‌ చౌరస్తా చెక్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మి వారంరోజుల నుంచి లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తున్న 50 మంది పోలీసులకు లంచ్‌ పంపిస్తున్నారు. సినీనటి రేణుదేశాయ్‌ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలసి కరోనా రోగులకు తనవంతు సాయం చేస్తున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు, కరోనా రోగులకు ఆహారం, మందులు తదితర అవసరాల కోసం ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వివరాలు పంపిస్తే సహాయం చేస్తున్నారు.

Cheetahs: 74 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా నుంచి భారత అడవుల్లో అడుగుపెట్టనున్న చిరుతలు.. ప్రభుత్వం ఏర్పాట్లు

Black fungus : షుగర్ పేషేంట్లు కొవిడ్ తగ్గిన తర్వాత ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్‌ చెక్ చేసుకోవాలి : మంత్రి పేర్ని నాని

Roman bath complex: బీచ్ లో బయటపడిన రోమన్ కాలం నాటి స్నానాల గదుల సముదాయాలు.. ఎక్కడంటే..