AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

jagame thandhiram: “నీతో.. ప్రేమలోన పడిపోయా…” అంటున్న ధనుష్.. ‘జగమేతంత్రం’ మూవీ నుంచి అందమైన పాట…

"నీతో.. ప్రేమలోన పడిపోయా నీతో.. " అంటూ ధనుష్ తెగ హంగామా చేస్తున్నారు. "ఓర కంటి చూపులకే ప్రాణమంతా జివ్వుమందే" అంటూ తెగ గింజుకుంటున్నారు.

jagame thandhiram: నీతో.. ప్రేమలోన పడిపోయా... అంటున్న ధనుష్.. 'జగమేతంత్రం' మూవీ నుంచి అందమైన పాట...
Rajeev Rayala
|

Updated on: May 23, 2021 | 10:17 PM

Share

“నీతో.. ప్రేమలోన పడిపోయా నీతో.. ” అంటూ ధనుష్ తెగ హంగామా చేస్తున్నారు. “ఓర కంటి చూపులకే ప్రాణమంతా జివ్వుమందే” అంటూ తెగ గింజుకుంటున్నారు. పబ్లిక్‌గా ఆ బ్యూటీ వెంట పడుతూ.. జగత్‌జంత్రి వేషాలు వేస్తున్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకోసం అని అనుకుంటున్నారా.. ఓ సినిమాలోని పాటకోసం లెండి! ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్  డైరెక్షన్లో తమిళ్‌లో తెరకెక్కుతున్న చిత్రం “జగమే తందిరమ్‌”. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓ ప్రముఖ ఓటీటీ వేదికగా జూలై 18న రిలీజ్‌ చేయాలని ఈ మూవీ మేకర్స్‌ రెడీ అయిపోతున్నారు. అంతేకాదు “జగమే తంత్రం” పేరుతో తెలుగులోనూ అదే రోజున రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగానే కొద్ది రోజుల ముందు ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన ఈ మూవీ యూనిట్… తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను రిలీజ్‌ చేసింది.

“నీతో.. ప్రేమలో పడిపోయా నీతో…” అంటూ సాగే ఈ పాట విడుదలైన క్షణం నుంచి మంచి రెస్పాన్స్‌ రాబడతూ.. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. రొమాంటిక్‌ మెలోడీ సాంగ్‌గా రూపొందిన ఈ సాంగ్‌లో ధనుష్, ఐశ్వర్య లక్ష్మీల మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించగా… భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చారు. విజయ్‌నారియన్‌ ఆలపించారు. ధనుష్‌ ఇందులో సూరాలి అనే గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా ధనుష్కు కెరీర్‌లో 40వ చిత్రమవడం ఓ  విశేషం కాగా… ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటుడు జేమ్స్ కాస్మో ఈ సినిమాలో నటిస్తుండడం మరో విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anasuya : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆకాశానికెత్తేసిన రంగమ్మత్త.. ఆయన అంకితభావం కలిగి ఉన్న స్టార్ అంటూ..

S. Thaman: గోపీచంద్ మలినేని సినిమాకు సంగీతదర్శకుడు ఫిక్స్.. బాలయ్య సినిమాకు బద్దలయ్యే మ్యూజిక్ ఇవ్వనున్న తమన్..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!