కరోనా బాధితుల సేవలో సెలబ్రెటీలు.. వంద ఆక్సిజన్ బెడ్స్ అందించిన సింగర్ స్మిత.. ఇదంతా వారివల్లే సాధ్యమంటూ ట్వీట్

Singer Smita: కరోనా రెండో దశలో భారత్ అల్లాడిపోతుంది. ఓ వైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తుండగా.. మరోవైపు.. బ్లాక్, వైట్ ఫంగస్ వ్యాధులతో ప్రజల పరిస్థితి

కరోనా బాధితుల సేవలో సెలబ్రెటీలు.. వంద ఆక్సిజన్ బెడ్స్ అందించిన సింగర్ స్మిత.. ఇదంతా వారివల్లే సాధ్యమంటూ ట్వీట్
Smita
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2021 | 8:42 AM

Singer Smita: కరోనా రెండో దశలో భారత్ అల్లాడిపోతుంది. ఓ వైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తుండగా.. మరోవైపు.. బ్లాక్, వైట్ ఫంగస్ వ్యాధులతో ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. ఇక దేశ వ్యాప్తంగా ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్స్, వెంటిలెటర్స్, ఐసీయూ బెడ్స్ కొరతతో ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితితులలో పలువురు సెలబ్రెటీలు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన పలువురు నటీనటులు రకారకాలుగా సహాయం అందిస్తున్నారు. తాజాగా సింగర్ స్మిత కూడా కరోనా బాధితులకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. తన టీంతో కలిసి ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గతంలో తను స్టాపించిన ఏఎల్‌ఏఓతో (ALAO) పాటు పలు స్వచ్చంద సంస్థలతో కలిసి వంద ఆక్సిజన్ బెడ్‏లను ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పారు. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పుకోచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా టీంకు ఎంతో రుణపడి ఉంటారు. వారు ఎప్పుడూ కూడా నన్ను ఓడిపోనివ్వలేదు. ఎలాంటి పని అని చూడకుండా ఎంత కష్టం అని ఆలోచించకుండా నా కోసం చేసేశారు. ఒకవేళ వారంటూ లేకపోతే నా కలలన్నీ కలలుగానే ఉండిపోయేవి. వంద బెడ్స్ ఆక్సిజన్ నిజం చేయడానికి వారు నాకు సహకరించారు. ఫ్యూజన్, విజయవాడ, బబుల్స్ విజయవాడ టీంకు థ్యాంక్స్. ఆక్సిజన్స్ బెడ్స్ రెడీ అవుతున్నాయి అని చెప్పారు. అలాగే ప్రాజెక్ట్ ఆక్సిజన్ హైదరాబాద్ గురించి చెప్పుకోచ్చారు. 50 బెడ్స్, ఆక్సిజన్ రెడీగా ఉందని చెప్పారు. దీనిని కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ పని చేస్తున్నామని… ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సజ్జనార్ గారికి ఇస్తున్నామని తెలిపారు..

ట్వీట్స్..

Also Read: సినీ పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో రామ్ గోపాల్ వర్మ సోదరుడు మృతి.. సంతాపం తెలిపిన బోనీ కపూర్…

డాక్టర్లు దేవుళ్ళు కాదు.. వారిలో రాక్షసులు కూడా ఉన్నారు.. వారే నా తండ్రిని చంపేశారు.. ఎవరిని వదలను.. నటి ఆవేదన..