NEFT Users: ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే వారు ఓ సారి ఈ వార్త చదవండి.. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ సేవలు ఉండవు.
NEFT Users Alert: మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) సేవలను ఉపయోగిస్తారా.? అయితే ఈ వార్త మీ కోసమే. ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ సేవల్లో అంతరాయం ఉండనుంది...
NEFT Users Alert: మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) సేవలను ఉపయోగిస్తారా.? అయితే ఈ వార్త మీ కోసమే. ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ సేవల్లో అంతరాయం ఉండనుంది. నెఫ్ట్ వ్యవస్థలో కొత్తగా సాంకేతికంగా మార్పులు చేపడుతున్న నేపథ్యంలో ఈ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే శనివారం అర్థరాత్రి 12.00 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆర్బీఐ తెలిపింది. ఇక ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ఖాతాదారులకు ముఖ్యగమనిక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపడుతోన్న టెక్నికల్ అప్‌గ్రేడ్ కారణంగా నెఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడనుంది అని తెలిపిన ఎస్‌బీఐ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు యోనో, యోనో లైట్‌లో నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవు అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇక రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ఎస్‌బీఐ తెలిపింది. దీనికి అనుగుణంగా లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
ఎస్‌బీఐ ట్వీట్..
Important Notice for our customers w.r.t. NEFT technical upgradation by RBI#SBI #StateBankOfIndia #ImportantNotice #InternetBanking #OnlineSBI pic.twitter.com/p3XWoeTwxj
— State Bank of India (@TheOfficialSBI) May 21, 2021
Also Read: Sushil Kumar: హత్య కేసులో.. ఎట్టకేలకు రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్ట్..! ఎక్కడ పట్టుబడ్డాడంటే..?
Gas cylinder: బంపర్ ఆఫర్.. రూ.9 కే గ్యాస్ సిలిండర్.. ఎలా సొంతం చేసుకోవాలంటే..?
ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. సర్వీస్ చార్జీలను తగ్గింపు చేసిన బ్యాంక్.. ఇక వారికి బెనిఫిట్..