Health Insurance: ప్రీమియం రెన్యువల్‌ రేటు పెరిగిందా..? మీ పాలసీని వేరే సంస్థకు ఇలా బదిలీ​ చేసుకోండి

Health Insurance: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ విజృంభిస్తుండటంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో క్లెయిమ్‌ల సంఖ్య కూడా విపరీతంగా..

Health Insurance: ప్రీమియం రెన్యువల్‌ రేటు పెరిగిందా..? మీ పాలసీని వేరే సంస్థకు ఇలా బదిలీ​ చేసుకోండి
Follow us
Subhash Goud

|

Updated on: May 23, 2021 | 2:26 PM

Health Insurance: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ విజృంభిస్తుండటంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో క్లెయిమ్‌ల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. దీంతో అనేక బీమా సంస్థలు హెల్త్​ఇన్సూరెన్స్​ప్రీమియం రేట్లను పెంచేస్తున్నాయి. సాధారణంగా, ఇదివరకే తీసుకున్న బీమా ప్రీమియం రేట్లు పెంచడానికి, ప్రయోజనాలు తగ్గించడానికి అనుమతి లేదు. కానీ, చాప్టర్ – IIIలోని క్లాజ్(జి) ప్రకారం బీమా ప్రీమియం రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని గత కొన్ని నెలలుగా అనేక బీమా సంస్థలు తమ ప్రీమియం రెన్యూల్​రేట్లను 30 నుంచి 100 శాతం మేర పెంచేశాయి. ప్రస్తుతం క్లెయిమ్​ల సంఖ్య పెరుగుతున్నందున.. నష్టాల నుంచి గట్టెక్కాలంటే ప్రీమియం రేట్లు పెంచక తప్పడం లేదని బీమా సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే ఇలా ప్రీమియం రెన్యువల్‌ రేట్లు పెంచడం వల్ల పాలసీదారుడిపై మరింత భారం పడుతోంది. దీంతో వారు ఉపశమనం పొందేందుకు పాలసీని పోర్టబుల్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి బీమా కంపెనీలు. ప్రస్తుతం మీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్‌పై అసంతృప్తిగా ఉంటే తక్కువ ప్రీమియం రేటుకు అనే ప్రయోజనాలు అందించే ఇతర బీమా సంస్థకు పాలసీని మార్చుకోవచ్చు. మీరు ఒక వ్యక్తిగత బీమా పాలసీ నుంచి కుటుంబ పాలసీకి మారడానికి అవకాశం ఉంటుంది. కానీ, సాధారణ పాలసీ నుంచి క్రిటికల్​ఇన్‌నెస్‌ పాలసీకి మారే అవకాశం ఉండదు.

మీ పాలసీని ఎలా పోర్ట్ చేయాలి?

మీ ప్రస్తుత పాలసీ రెన్యువల్‌కు కనీసం 45 రోజుల ముందు పోర్టింగ్ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. క్రొత్త పాలసీకి పోర్ట్ చేసుకునే ముందు నియమ నిబంధనలు, ప్రీమియం రేట్లను పరిశీలించాలి. మీరు బదిలీ చేయాలనుకుంటున్న కొత్త బీమా సంస్థకు చెందిన పోర్టబిలిటీ ఫారమ్ నింపాలి. దీనికి మీ వ్యక్తిగత సమాచారం, ఇప్పటికే ఉన్న వ్యాధులు, మెడికల్​హిస్టరీ ఫారమ్​లో పేర్కొనండి. బీమా పోర్ట్​కు అభ్యర్థించే సమయంలో ప్రపోజల్ ఫారమ్​, పోర్టబిలిటీ ఫారమ్, ఐడెంటిటీ, రెసిడెన్సీ ప్రూఫ్, మెడికల్​హిస్టరీ, గత క్లెయిమ్‌ల, కొత్తగా నిర్ధారణ అయిన వ్యాధి ఏవైనా ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, పాలసీ సర్టిఫికేట్లు, రెన్యువల్​ స్లిప్స్, సెల్ఫ్​ డిక్లరేషన్, ఇన్వెస్టిగేషన్​రిపోర్ట్, ఇతర డాక్యుమెంట్స్​సమర్పించాలి.

పోర్ట్‌కు సంబంధించిన ప్రక్రియ, నియమ నిబంధనల కోసం ఐఆర్‌ డీఏఐ అధికారిక పోర్టల్‌కు చూడవచ్చు. ప్రస్తుత బీమా సంస్థ మీ మెడికల్, క్లెయిమ్‌ల హిస్టరీకి సంబంధించిన సమాచారాన్ని కొత్త బీమా సంస్థకు అందిస్తుంది.అన్ని వివరాలను స్వీకరించిన తరువాత, కొత్త బీమా సంస్థ మీ ప్రతిపాదనను పరిశీలించాలి.15 రోజుల్లోపు అంగీకరణ లేదా తిరస్కారణ విషయాన్ని పాలసీదారునికి తెలియజేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే, ఆటోమేటిక్​గా మీ పాలసీ అంగీకరించినట్లుగా పరిగణించబడుతుంది.

అయితే పోర్ట్​చేసుకున్న క్రమంలో మీ నుంచి కొత్త బీమా సంస్థ అదనపు పోర్టబిలిటీ ఛార్జీలను వసూలు చేయదు. కేవలం ప్రీమియం మాత్రమే తీసుకుంటుంది. మీరు 45 ఏళ్లు పైబడి ఉంటే లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైతే ఉచిత మెడికల్ చెకప్ ​చేయించుకోవాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి:

బిగ్‌ బజార్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.1500 షాపింగ్‌ చేస్తే రూ.1000 క్యాష్‌ బ్యాక్‌.. వివరాలు ఇవే

LIC Plan: ఎల్‌ఐసీలో అద్భుతమైన ప్లాన్‌.. ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10 వేల వరకు పెన్షన్‌ తీసుకోవచ్చు.. ఎలాగంటే