AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HOROSCOPE TODAY : ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యతను పాటించాలి.. ఉద్యోగ ప్రయత్నంలో విజయం..

RASI PHALALU- 2021 ON MAY 25 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ

HOROSCOPE TODAY :  ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యతను పాటించాలి.. ఉద్యోగ ప్రయత్నంలో విజయం..
Horoscope Today
uppula Raju
|

Updated on: May 25, 2021 | 5:52 AM

Share

RASI PHALALU- 2021 ON MAY 25 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు మంగళవారం (మే 25న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి.. ఈ రోజు గ్రహాల స్థితి కారణంగా మేష రాశి వారికి మధ్యస్తంగా ఉంటుందియ. ఉపాధి కోసం ప్రయత్నిస్తుంటే అందులో విజయం సాధిస్తారు. అంతేకాకుండా కొనసాగుతున్న ప్రయత్నాలు అర్థవంతంగా ఉంటాయి. ఆదాయ, వ్యయాల మధ్య సమతూల్యతను పాటించాలి.

వృషభ రాశి.. రాశి స్వామి శుక్రుడు వృషభంలో మొదటి, ఏడవ పాదాల్లో ఉండటం వల్ల ఈ రోజు మీ వ్యాపార ప్రణాళిక ఊపందుకుంటుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇవి మీకు లాభదాయకంగా మారతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది.

మిథున రాశి.. మీ రాశి మొదటి పాదంలో అంగారకుడు, ఐదో పాదంలో చంద్రుడు ఉండటం వల్ల ఈ రోజు మీకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా చేసిన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు తిరిగి పూర్తి చేసుకుంటారు. సోదరుడు లేదా సహచరుల నుంచి మద్దతు లభిస్తుంది.

కర్కాటక రాశి.. ఈ రోజు గ్రహాల స్థితి కారణంగా పనిప్రదేశంలో మీరు విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా పురోగతి ఉంటుంది. మీ మాటల్లో సౌమ్యత ప్రతిష్ఠను పెంచుతుంది. ప్రజల నుంచి అభినందనలు అందుకుంటారు.

సింహ రాశి.. ఈ రోజు సింహ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటలపై సంయమనం పాటించండి. వ్యాపార రంగంలో విజయాన్ని సాధిస్తారు. సుదూర ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో విజయం అందుకుంటారు.

కన్యరాశి.. కన్యా రాశి అధిపతి బుధుడు మీ రాశి నుంచి 9వ పాదంలో ఉన్నాడు. ఈ సమయంలో శత్రువుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఆరోగ్యం మృదువుగా ఉంటుంది.

తులారాశి.. తులా రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జీవనోపాధి రంగంలో చేసిన ప్రయత్నాలు విజయంవంతమవుతాయి. సంతానం పురోగతి సాధించడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. కెరీర్ పరంగా కొన్ని చింతలు తీరిపోతాయి. ఈ రోజు మీరు ఏదైనా విలువైన దాన్ని కోల్పోవచ్చు.

వృశ్చిక రాశి.. వ్యాపార ప్రణాళికలు శక్తిమంతంగా ఉంటాయి. ఫలితంగా మీరు విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. దాంపత్య జీవితంలో ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు రాశి.. ఈ రోజు వృశ్చిక రాశిలో చంద్రుడు, కేతువు రావడం వల్ల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చదువులో సఫలీకృతులవుతారు. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. విలువైన వస్తువును పోగొట్టుకునే అవకాశముంది.

మకర రాశి.. వైవాహిక జీవితంలో ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. రోజువారీ వ్యాపారంలో తీవ్రంగా శ్రమించినప్పటికీ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. లేకుంటే నష్టం జరగవచ్చు.

కుంభరాశి.. ఈ రోజు ఆర్థిక విషయాల్లో మీరు చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. పిల్లల బాధ్యత నెరవేరుతుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసుకుంటారు.

మీన రాశి.. ఈ రోజు మీన రాశిలో 9వ పాదంలో చంద్రుడు ఉండటం వల్ల పనిప్రదేశంలో విజయం సాధిస్తారు. ఇంటి అవసరాలు పెరుగుతాయి. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మనస్సు సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి.