Mahashivratri 2025: మహాశివరాత్రికి ముందు ఇవి మీ కలలో కనిపిస్తే.. పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థం..!
మహాశివరాత్రి రోజున లేదా మహాశివరాత్రికి ముందు ఇవి మీ కలలో కనిపిస్తే మీపై శివుడి అనుగ్రహం ఉన్నట్లేనని వేదపండితులు చెబుతున్నారు. మహా శివరాత్రికి కొన్ని రోజుల ముందు కలలో శివలింగానికి పాలాభిషేకం చేస్తున్నట్లు కనిపిస్తే మీ కష్టాలు పోతాయని, జీవితం ఆనందమయం అవుతుందని అర్థం. శివరాత్రి సమయంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తే.. దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందువుల పవిత్ర పండుగలలో ఒకటైన మహా శివరాత్రి.. శివ భక్తులకు చాలా ప్రత్యేకమైన రోజు. మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణం ఉండటం ఒక సంప్రదాయం. అయితే, శివరాత్రి సమయంలో మీ కలలో కొన్ని సంఘటనలు లేదా వస్తువులు కనిపిస్తే, అది చాలా శుభప్రదంగా, జీవితానికి మార్గదర్శక కాంతిగా పరిగణించబడుతుంది.
నంది శివ భక్తుడు మాత్రమే కాదు, ఆయన వాహనం కూడా. నీలకంఠుడు నంది ద్వారా మాత్రమే పూజను అంగీకరిస్తాడని చెబుతారు. విరూపాక్ష భక్తులు తమ కోరికలను శివుని ముందు కూర్చున్న నంది చెవులలో చెబితే, ఆ కోరికలు త్వరగా శివుడికి చేరుతాయని, త్వరలోనే తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
శివుడికి చాలా పేర్లు ఉన్నాయి. అందుకే అతన్ని ‘రుద్రుడు’ అని కూడా పిలుస్తారు. శివుడు రుద్రాక్ష ప్రియుడు. మహాశివరాత్రి సమయంలో మీరు రుద్రాక్షను చూసి పూజిస్తే, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు రాజ్యమేలుతాయి. మీరు మీ కలలో రుద్రాక్షను చూసినట్లయితే, మీ దుఃఖాలన్నీ తొలగిపోతాయని అర్థం.
శివలింగాన్ని పూజించే ప్రదేశం తీర్థయాత్ర స్థలంగా మారుతుందని నమ్ముతారు. శివలింగాన్ని పూజించే ప్రదేశంలో ఎవరైనా మరణిస్తే, వారికి శివలోక అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. అదేవిధంగా కలలో శివలింగాన్ని చూడటం అంటే మీ కోరిక నెరవేరుతుందని అర్థం.
మహాదేవుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. మీ కలలో మీరు దేవునికి నైవేద్యం పెట్టడం కంటే, పాలు, నీరు, తేనె, కొబ్బరి నీరు, చక్కెర, ఖర్జూరం, పెరుగు, నెయ్యి లేదా పండ్లతో అభిషేకం చేస్తున్నట్లు కనిపిస్తే అది మీపై శివుని ఆశీస్సులను కూడా ప్రతిబింబిస్తుంది.
శివుడికి బిల్వ ఆకులు చాలా ఇష్టం. బిల్వ పత్రాలను సమర్పించడం వలన భక్తుని కోరికలు నెరవేరుతాయని, అతని అన్ని దుఃఖాలు, బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. మీ కలలో బిల్వ ఆకును చూడటం అంటే మీరు చేపట్టబోయే కొత్త పనిలో విజయం సాధిస్తారని అర్థం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..