Maha Shivaratri: శివలింగంపై నిత్యం జలధార.. మహా శివరాత్రి సందర్భంగా బుగ్గ జాతరకు సర్వం సిద్ధం
పురాతన దైవ క్షేత్రంగా భావించే ఇక్కడి గర్భ గుడిలో శివలింగంపై జలధార నిత్యం వస్తూనే ఉంటుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పోటీ పడుతుంటారు. బుగ్గ జాతర 7 ,8 ,9 తేదీల్లో కొనసాగనుంది. జాతర ఏర్పాట్లను బుధవారం బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, ఆలయ కమిటీసభ్యులు పరిశీలించారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి ఆలయం జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎండోమెంట్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండు గుట్టల నడుమ కొలువైన శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు.
పురాతన దైవ క్షేత్రంగా భావించే ఇక్కడి గర్భ గుడిలో శివలింగంపై జలధార నిత్యం వస్తూనే ఉంటుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు పోటీ పడుతుంటారు. బుగ్గ జాతర 7 ,8 ,9 తేదీల్లో కొనసాగనుంది. జాతర ఏర్పాట్లను బుధవారం బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, ఆలయ కమిటీసభ్యులు పరిశీలించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..