- Telugu News Photo Gallery Holi festival 2024: Holi Colour Easily Remove From Face And Hair By This 5 Tips
Holi colour remove tips: హొలీ రంగులను తొలగించడానికి ఈ 5 చిట్కాలను అనుసరించండి
పిల్లలు, పెద్దలు ఎదురు చూసే హొలీ పర్వదినం ఈ ఏడాది మార్చి 25 సోమవారం జరుపుకోనున్నారు. రంగులను జల్లుకుంటూ ఆనందంగా గడపనున్నారు. అయితే ఈ రంగుల్లో సహజమైన రంగులతో ఎటువంటి సమస్య ఉండదు. అయితే ముఖం, చేతులు, జుట్టు మీద పడిన రంగులను తొలగించడం కష్టంగా ఉంటుంది. అందుకే రంగులతో ఆడుకోవడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు.
Updated on: Mar 12, 2024 | 5:43 PM

హొలీ పండుగ వస్తోంది. పండుగ రోజున రంగులతో ఆడుకోక పోతే వినోదం అసంపూర్ణంగా ఉంటుంది. ఇక రంగులను జల్లుకోవడం ఇష్టం లేని వారు హోలీకి దూరంగా ఉన్నా.. ఆఫీసుకు, మార్కెట్‌కి ఇలా బయటకు వెళ్లే సమయంలో ఎవరొకరు మీద రంగులను జల్లుతారు.

శరీరం మీద పడిన రంగులను సరిగ్గా తొలగించుకోక పోతే, అది చర్మం నుంచి జుట్టు వరకూ చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. కనుక రంగులతో ఆడుకున్న కొద్దిసేపటికే వాటిని తొలగించుకోవాలి. చర్మం, జుట్టు నుండి మొండి రంగులను తొలగించడానికి కొన్ని చిట్కాలను తెలుసుకోండి

రంగులతో ఆదుకోవడానికి ముందు ముఖం, చేతులకు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను అప్లై చేయండి. నూనె రాసుకోవడం ఇష్టం లేకపోతే సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్ రాయండి. అప్పుడు రంగులతో ఎంత సేపు అడ్డుకున్నా ఆ రంగులు చర్మంలోకి లోతుగా వెళ్లవు.. తేలికగా తొలగించుకోవచ్చు.

రంగులతో ఆడుకున్న తర్వాత సబ్బుతో లేదా ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవడం వల్ల రంగులు పూర్తిగా తొలగిపోవు. అయితే రంగులను పూర్తిగా సహజమైన రీతిలో తొలగించడానికి తేనె, క్యాలమైన్ లోషన్ , రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి. దీన్ని మీ ముఖానికి పట్టించి కాసేపు ఉంచి తర్వాత కడిగేయండి. చర్మం క్లియర్ అవుతుంది.

రంగును తొలగించడానికి మీ ముఖాన్ని ఎప్పుడూ స్క్రబ్ చేయవద్దు. బదులుగా గోరువెచ్చని నీటిలో ఉప్పు, గ్లిజరిన్ , కొన్ని చుక్కల అరోమా ఆయిల్ కలపండి. మీ ముఖానికి అప్లై చేయండి. ఇది హానికరమైన రసాయనాల నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది

నిమ్మరసం ఏదైనా రంగును తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. కాబట్టి రంగులతో ఆడుకున్న తర్వాత ముఖానికి నిమ్మరసం రాయండి. లేదా పెరుగు, శెనగపిండి, పసుపు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. ముఖం నుండి మొత్తం శరీరం వరకు దీన్ని అప్లై చేయండి. కొంచెం సేపు ఆ మిశ్రమాన్ని ఆరనిచ్చి అనంతరం గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయండి.

రంగు కూడా జుట్టును పాడు చేస్తుంది. కాబట్టి షాంపూతో తలస్నానం చేసే ముందు నీళ్లతో మీ జుట్టును బాగా కడగాలి. తర్వాత ఆలివ్ ఆయిల్, తేనె, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. లేదా కోడిగుడ్డు సొనను తలకు పట్టించవచ్చు. అప్పుడు షాంపూ చేసి అనంతరం జుట్టుకు కండిషనర్ అప్లై చేయండి.




