అధిక చక్కెర పిల్లల దంతాలను దెబ్బతీస్తుంది. పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తుంది. అంతేకాకుండా, చక్కెర ఎక్కువ కలిగిన వాటిని పిల్లలు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర చర్మానికి మంచిది కాదు. ఎక్కువ చక్కెర తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా, అకాల వృద్ధాప్యం, మొటిమలు, దద్దుర్లు సమస్యలు కూడా కనిపిస్తాయి.