- Telugu News Photo Gallery Cricket photos Rohit sharma hints kuldeep yadav might be rested in dharamshala test india vs england 5th test
IND vs ENG 5th Test: ధర్మశాల నుంచి మ్యాచ్ విన్నర్ ఔట్.. ముందే హింటిచ్చిన రోహిత్ శర్మ.. ఎందుకో తెలుసా?
Team India Playing 11 vs Engalnd: ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. టీంఇండియా సిరీస్ గెలిచినా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికను పరిగణనలోకి తీసుకుంటే చివరి మ్యాచ్ చాలా ముఖ్యం. ఐదో టెస్టులో భారత జట్టు ఏ ప్లేయింగ్ ఎలెవన్తో ఆడుతుందనేది ప్రశ్నగా మారింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ను తప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Updated on: Mar 06, 2024 | 8:45 PM

India vs England 5th Test: ధర్మశాల టెస్టుకు ముందు రోహిత్ శర్మ మాట్లాడిన ఓ విషయం భారత అభిమానులకు షాక్ ఇచ్చింది. ధర్మశాలలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ ముగ్గురు పేసర్లకు ప్లేయింగ్ ఎలెవన్లో అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. ప్లేయింగ్ ఎలెవన్‌ను ఇంకా నిర్ణయించలేదని, అయితే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రోహిత్ తెలిపాడు.

ధర్మశాలలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు అంటే టీం ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. అంటే అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లలో ఎవరో ఒకరు ఔటవుతారు. అశ్విన్ ధర్మశాల టెస్టులో ఆడటం ఖాయమని, జడేజా తన బ్యాటింగ్ కారణంగా తప్పుకోవడం కష్టమేనని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి రోహిత్ శర్మ అతన్ని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగిస్తాడా? లేదా అనేది తెలవాల్సి ఉంది.

ఈ టెస్టు సిరీస్లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. రాంచీలోని రాజ్ కోట్ లో జట్టును గెలిపించాడు. కానీ, ధర్మశాలలో మాత్రం అతను ప్లేయింగ్ ఎలెవన్ లో ఉండడు అనేది తేలాల్సి ఉంది. ముగ్గురు పేసర్లకు అవకాశం ఇవ్వాలని రోహిత్ శర్మ ఎందుకు మాట్లాడుతున్నాడనేది ఇప్పుడు ప్రశ్న.

ధర్మశాల వాతావరణం, అక్కడి పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. చివరి టెస్టులో విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వచ్చాడు. కాబట్టి అతను ప్లేయింగ్ ఎలెవన్లో ఆడటం ఖాయం. సిరాజ్‌కు కూడా అవకాశం లభిస్తుంది. ఆకాష్ దీప్ కూడా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంపిక చేయవచ్చు. కాబట్టి, ఆకాశ్ దీప్ స్థానంలో కుల్దీప్ ను తీసుకుంటారా? అనేది తెలవాల్సి ఉంది.

రజత్ పాటిదార్ జట్టులో కొనసాగుతారని రోహిత్ శర్మ మీడియా సమావేశంలో సూచించాడు. ఇంత తక్కువ సమయంలో రజత్ పాటిదార్ ను కాదనడం సరికాదని రోహిత్ అన్నాడు. రజత్ లో టాలెంట్ ఉందని టీం ఇండియాకు తెలుసు కాబట్టి అతను ఈ ఆటగాడికి సపోర్ట్ చేస్తున్నాడు.

ధర్మశాల టెస్టులో భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.




