AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasi: కాశీకి వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. మరో వసతి గృహం ప్రారంభం.. శివరాత్రి నుంచి అందుబాటులోకి

కాశీలో తెలుగు భక్తుల కోసం మరో వసతి గృహం అందుబాటులోకి వచ్చింది. దశాబ్ధాల కాలంగా కాశీకి వెళ్లే తెలుగువారికి ఉచిత వసతి, భోజనం ఏర్పాట్లను అందజేస్తున్న శ్రీరామతారకాంధ్ర ఆశ్రమం మరో వసతి గృహాన్ని కొత్తగా ప్రారంభించింది. శ్రీరామభద్రేంద్రసరస్వతి చేత స్థాపించబడిన శ్రీరామతారకాంధ్ర ఆశ్రమం మరింత విస్తరించబడింది. అత్యాధునిక వసతులు, హంగులతో నూతన వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరామ తారకాంధ్ర ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వేంకట సుందరశాస్త్రి ఆధర్వంలో ఏర్పాటైన ఈ నూతన వసతి గృహం శివరాత్రి సందర్భంగా.. రేపటి నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది.

Kasi: కాశీకి వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. మరో వసతి గృహం ప్రారంభం.. శివరాత్రి నుంచి అందుబాటులోకి
GOOD NEWS FOR KASHI PILIGRIMS
Mahatma Kodiyar
| Edited By: Surya Kala|

Updated on: Mar 07, 2024 | 8:46 AM

Share

కాశీలో తెలుగు భక్తుల కోసం మరో వసతి గృహం అందుబాటులోకి వచ్చింది. దశాబ్ధాల కాలంగా కాశీకి వెళ్లే తెలుగువారికి ఉచిత వసతి, భోజనం ఏర్పాట్లను అందజేస్తున్న శ్రీరామతారకాంధ్ర ఆశ్రమం మరో వసతి గృహాన్ని కొత్తగా ప్రారంభించింది. ఇది కాశీకి వెళ్లే తెలుగు వారికి ఇది నిజంగా శుభవార్తే.  గత కొన్ని దశాబ్ధాల కాలంగా కాశీకి వెళ్లే తెలుగు వారికి ఉచిత వసతి, భోజనం ఏర్పాట్లను అందజేస్తున్న శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం మరో వసతి గృహాన్ని కొత్తగా ప్రారంభించింది. శ్రీరామభద్రేంద్ర సరస్వతి చేత స్థాపించబడిన శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం ఇప్పుడు విస్తరించబడింది. అత్యాధునిక వసతులతో, కొత్త హంగులతో నూతన వసతి గృహాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశారు. శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వేంకట సుందర శాస్త్రి ఆధర్వంలో ఏర్పాటైన నూతన వసతి గృహం రానున్న శివరాత్రి రోజు నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది.

నూతన వసతి గృహాన్ని కుర్తాళం పీఠాధిపతులు సిద్దేశ్వరానంద భారతీ స్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రీ రామతారక ఆంథ్రఆశ్రమానికి తమకు ఎన్నో ఏళ్లుగా మధురమైన అనుబంధం ఉన్నదని తెలిపారు. మానేజింగ్ ట్రస్టీ సుందర శాస్త్రి గారి నాన్న గారు వేమూరి శ్రీ రామ చంద్ర మూర్తిగారి సేవలను గుర్తు చేసుకున్నారు. వేమూరి వేంకట సుందర శాస్త్రి గారు ఈ ఆశ్రమ అభివృద్ధి కి ఎంత గానో కృషి చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా గతంలో తను చాతుర్మాస్య వ్రతం దీక్ష ఈ ఆశ్రమం లో ఉండి కొనసాగించినట్లు కూడా తెలిపారు.

ఆంధ్ర ఆశ్రమం వారు అందిస్తున్న వసతి సౌకర్యాలు ,సేవలు అనేక మందిభక్తులు సద్వినియోగం చేసుకుంటూ శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి వారి ని దర్శించుకునే అదృష్టాన్ని పొందుతున్నారని అన్నారు. ఆశ్రమ అభివృద్ధి కి భక్తులు తమకు చేతనైనంతగా ఉడతా భక్తిగా సహాయ సహకారాలు అందించాలని తమవంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ఆశ్రమానికి వచ్చిన వారందరికీ తమ సొంత ఇంటికి వచ్చామనే భావనతో ఆనందంగా ఉంటారని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాశీ అన్నపూర్ణా మాత ఆలయం ప్రధాన అర్చకులు మహంత శంకర పూరి మాట్లాడుతూ శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం సనాతన వైదిక ధర్మం పరిరక్షణ, సంస్కృతి సంప్రదాయాలు కాపాడే ప్రయత్నంగా ఈ ఆశ్రమం కృషి చేస్తున్నదని, అనేక రాష్ట్రాలనుండి వచ్చిన భక్తుల కు ఎంతగానో సేవలు అందిస్తూ, ప్రశంసలు అందుకుంటోంది అని ప్రశంసించారు.

ఆశ్రమ మానేజింగ్ ట్రస్టీ వేమూరి వేంకట సుందర శాస్త్రి మాట్లాడుతూపెద్ద వారి ఆశీర్వాదం బలం, దైవానుగ్రహం తో ఆశ్రమాన్ని నిర్వహిస్తూమని తెలిపారు. యాత్రీకులు సౌకర్యార్థం కాలానుగుణంగా అన్ని వసతులు కూడిన సరికొత్త భవననిర్మాణం కైలాస భవనం ఆవరణ లోనే కొత్త గాబ్లాక్ -ఎ గదులు ఏర్పాటు చేయటం, వాటిని స్వామి వారి చేతులమీదుగా ప్రారంభం చేయటం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అదనంగా సుమారు వంద మంది కి పై గా యాత్రీకులు ఉండటానికి గదులు ఉన్నాయని, శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి వారి దయతో స్వామి వారి అనుగ్రహం తో మరింత కొత్త నిర్మాణాలను చేయాలనే సంకల్పంతో ఉన్నామని అన్నారు. శివరాత్రి పర్వదినం నుంచి కైలాస భవన్ బ్లాక్ -ఎ గదులు భక్తులు కు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నూతన వసతి గృహాన్ని కుర్తాళం పీఠాధిపతులు సిద్దేశ్వరానందభారతీస్వామి ప్రారంభించారు. శ్రీరామతారకాంధ్ర ఆశ్రమానికి తమకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందన్నారాయన. ఇక.. తెలుగు రాష్ట్రాల భక్తులు కాశీలోని ఈ వసతి గృహాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..