AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thursday Puja Tip: వివాహంలో జాప్యమా, దంపతుల మధ్య వివాదాలా.. విష్ణువును ప్రసన్నం కోసం గురువారం ఎలా పూజ చేయాలంటే..

గురువారం ఉపవాసం పాటించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం,​జ్ఞానం పెంపొందుతుంది అంతేకాదు గురు దోషం నుండి విముక్తి పొందుతారు. ఈ రోజున విష్ణువుతో పాటు దేవ గురు బృహస్పతిని కూడా నియమాను సారం పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం వరుసగా ఏడు రోజులు గురువారం ఉపవాసం చేయడం.. గురు గ్రహాన్ని పూజించడం వల్ల జాతకంలో గురు గ్రహానికి సంబంధించిన అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

Thursday Puja Tip: వివాహంలో జాప్యమా, దంపతుల మధ్య వివాదాలా.. విష్ణువును ప్రసన్నం కోసం గురువారం ఎలా పూజ చేయాలంటే..
Thursday Puja Tips
Surya Kala
|

Updated on: Mar 07, 2024 | 7:30 AM

Share

హిందూమతంలో దేవతలు, దేవుళ్లతో పాటు గ్రహాల ఆశీర్వాదం పొందడానికి జపం, ఉపవాసం ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. ఆచారాల ప్రకారం వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి చెంది భగవంతుని అనుగ్రహాన్ని కూడా పొందుతాయి. ఋషులు, మునులు పూర్వకాలం నుండి ఉపవాస సంప్రదాయాన్ని అనుసరించడానికి కారణం ఇదే. హిందూ మత విశ్వాసం ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా గ్రహానికి అంకితం చేయబడింది. గురువారం విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున ఆయనను పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో గురువారం ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం.. దీని వలన విష్ణువుతో పాటు గురు గ్రహం అనుగ్రహం లభిస్తుంది.

గురువారం ఉపవాస ప్రయోజనాలు:

గురువారం ఉపవాసం పాటించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ​​జ్ఞానం పెంపొందుతుంది అంతేకాదు గురు దోషం నుండి విముక్తి పొందుతారు. ఈ రోజున విష్ణువుతో పాటు దేవ గురు బృహస్పతిని కూడా నియమాను సారం పూజిస్తారు.

మత విశ్వాసాల ప్రకారం వరుసగా ఏడు రోజులు గురువారం ఉపవాసం చేయడం.. గురు గ్రహాన్ని పూజించడం వల్ల జాతకంలో గురు గ్రహానికి సంబంధించిన అన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వివాహంలో ఏ విధమైన జాప్యం జరుగుతున్నా.. లేదా వైవాహిక బంధం ఏర్పరచుకోవడంలో అడ్డంకులు ఏర్పడుతున్నా.. అటువంటి వారు ఖచ్చితంగా గురువారం ఉపవాసం పాటించాలి. ఈ రోజున విష్ణువు, అరటి చెట్టును పూజిస్తారు.

గురువారం ఉపవాసం పాటించడం ద్వారా విష్ణువు, లక్ష్మీ దేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఇది ఒక వ్యక్తి జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలన్నింటిని తొలగిస్తుంది.

గురువారం నాడు ఉపవాసం చేయడం వల్ల సంతోషం, శ్రేయస్సు, శాంతి, పాపాల నుంచి విముక్తి, పుణ్యం లభిస్తాయి. అలాగే వైవాహిక జీవితంలోని ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఇది కాకుండా, గురువారం ఉపవాసం ఆర్థిక స్థితి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గురువారం ఉపవాసం ఎప్పుడు, ఎన్ని రోజులు ఆచరించాలి?

మొదటి సారి గురువారం ఉపవాసం ఉండబోతున్నట్లయితే.. కోరిక , విశ్వాసం ప్రకారం రోజులను ఎంచుకోవచ్చు. 5, 11, 21, 51, 101 మొదలైన రోజులు ఉపవాసం చేయవచ్చు. మీరు మొదటి సారి గురువారం ఉపవాస దీక్ష చేయనున్నట్లు అయితే గురువారం పుష్య నక్షత్రం సమయంలో ప్రారంభించాలి.

గురువారం నాడు ఉపవాసం పాటించడంలో ముఖ్యమైన నియమం ఏమిటంటే ఏ నెలలో నైనా శుక్ల పక్షం మొదటి గురువారం రోజు నుంచి ఉపవాస దీక్ష ప్రారంభించండి. ఈ వ్రతాన్ని 16 గురువారాలు ఆచరించాలి.  3 సంవత్సరాలు నిరంతరాయంగా కొనసాగించవచ్చు.

గురువారం ఉపవాస పద్ధతి

  1. ఉపవాసం ఉండాలంటే పసుపు, బెల్లం, పప్పులు, అరటిపండు, విష్ణుమూర్తి చిత్రపటం అవసరం. ఇంటి దగ్గర అరటి చెట్టు ఉంటే దానిని కూడా పూజించవచ్చు. గురువారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి విష్ణుమూర్తి చిత్రపటాన్ని శుభ్రం చేసుకోవాలి. అప్పుడు విష్ణు విగ్రహానికి స్నానం చేయించి, నీరు, పసుపుతో శుభ్రం చేయండి.
  2. దీని తరువాత విగ్రహానికి స్నానం చేయించిన తర్వాత పసుపు గుడ్డపై దేవుని విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా భావించబడుతుంది. అక్షతలను సమర్పించి మంత్రాలు, శ్లోకాలు జపించి గురువారం వ్రత కథను పఠించండి.
  3. పూజ చేసేటప్పుడు నెయ్యి దీపం వెలిగించండి. ఈ రోజున పసుపు రంగులో ఉండే మిఠాయిలను తయారు చేసి దానిని బృహస్పతికి సమర్పించండి.
  4. ఈ రోజున మీరు కూడా పసుపు రంగు దుస్తులు ధరించాలి. బృహస్పతిని పూజించిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి.
  5. గురువారం ఉపవాసం ప్రారంభించే రోజున జుట్టుకు తలంటుకోవద్దు. ఉప్పు పదార్థాలు తినవద్దు. విష్ణు చరిత్ర ను చదవడం లేదా వినడం ద్వారా మీ ఉపవాసాన్ని ముగించండి.
  6. అరటి చెట్టుకు పూజ చేసి దాని ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అక్షతలు, పెసరపప్పు ని అందించండి.
  7. విష్ణువుని  ప్రసన్నం చేసుకోవడానికి, మంత్రాలు పఠించండి. పసుపు బట్టలు దానం ఇవ్వండి.
  8. పురాణ మత గ్రంథాల ప్రకారం 33 కోట్ల మంది దేవుళ్లు,  దేవతలు ఆవులో నివసిస్తారు. అందుకే గురువారం  ఆవుకు ఆహారాన్ని తినిపిస్తారు. గురువారం ఆవుకు ఆహారం, బెల్లం తినిపిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి.
  9. మినప పప్పు, బియ్యం గురువారం తినకూడదు. గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించి బెల్లం, పసుపు దుస్తులు, శనగపప్పు, అరటిపండు సమర్పించి పేదలకు దానం చేయాలని ప్రతీతి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు