Magha Gupta Navratri 2021: మాఘ గుప్త నవరాత్రులు అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత.. పూజించే ప్రాంతాలు ఏమిటంటే..!

హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసములో నదీస్నానము చేసి, శ్రీమన్నారాయణుని పూజించి, శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుందని పెద్దల ఉవాచ.. అంతకు ప్రాముఖ్యం కలిసి మాఘమాసం.. ఇక ఈ నెలలో వచ్చే నవరాత్రులు కూడా...

Magha Gupta Navratri 2021: మాఘ గుప్త నవరాత్రులు అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత.. పూజించే ప్రాంతాలు ఏమిటంటే..!
Follow us

|

Updated on: Feb 12, 2021 | 5:00 PM

Magha Gupta Navratri 2021: హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసములో నదీస్నానము చేసి, శ్రీమన్నారాయణుని పూజించి, శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుందని పెద్దల ఉవాచ.. అంతకు ప్రాముఖ్యం కలిసి మాఘమాసం.. ఇక ఈ నెలలో వచ్చే నవరాత్రులు కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. మాఘ గుప్త్ నవరాత్రి సర్వ సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో నెలలో వస్తుంది. ఈ సంవత్సరం, ఈ పండుగ ఫిబ్రవరి 12, 2021 న ప్రారంభంకానున్నది. ఈనెల 21 తో ముగుస్తుంది. మరి ఈ పండగ విశిష్టత.. ఆచరించే విధానం గురించి తెలుసుకుందాం..!

నవరాత్రి అంటే రెండు పదాల సమ్మేళనం. నవ అంటే తొమ్మిది .. రాత్రి అంటే రాత్రులు కాబట్టి ఇది తొమ్మిది రాత్రులు జరుపుకునే పండగ. ఈ మాఘ గుప్త నవరాత్రి తొమ్మిది రోజుల పండుగ శక్తి యొక్క రూపంగా దుర్గాదేవి ని పూజిస్తారు. అయితే ఏడాదికి నాలుగు నవరాత్రులు వస్తాయి. అయితే చైత్ర , శారద నవరాత్రుల సమయంలో ప్రజలు ఎక్కువగా వేడుకలను జరుపుకుంటారు. అయితే మాఘ మరియు ఆషాఢ మాసాలలో కూడా నవరాత్రుల పండుగ వస్తుంది. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. ఇక మాఘమాసం లో వచ్చే గుప్తా నవరాత్రులను గాయత్రి ‘శిశిర్ నవరాత్రి’ అని కూడా పిలుస్తారు.

మాఘ గుప్త నవరాత్రి ఆచారాలు:

శారద నవరాత్రుల సమయంలో ఏ ఆచారాలను విధివిధానాలను పాటిస్తామో.. అవే మాఘ గుప్తా నవరాత్రి సమయంలో పాటించబడతాయి. మొదటి రోజు మాఘ గుప్త నవరాత్రి సమయంలో భక్తులు తెల్లవారుజామున లేచి ఉదయాన్నే స్నానం చేస్తారు. అనంతరం ఘటాస్థాపన చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేనిని కలశ స్థాపన అని కూడా అంటారు.

ఘటస్థాపన అంటే ఏమిటి?

నవరాత్రి సమయంలో ముఖ్యమైన ఆచారాలలో ఘటస్థాపన ఒకటి.  ఈ రోజు నుంచి దుర్గాదేవిని పూజను తొమ్మిది రకాలుగా పూజిస్తారు  నవరాత్రి మొదటి రోజు నీరు లేదా ముడి బియ్యంతో నిండిన కలశాన్ని , కొబ్బరి, మామిడి ఆకులతో అలంకరించి దుర్గాదేవిని ఆరాధించే ప్లేస్ లో ఉంచుతారు. అనంతరం భక్తులు తమ శక్తి కొలదీ దేవికి ధూపదీప నైవేద్యాలను అర్పిస్తారు.

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం గుప్త నవరాత్రులు ఫిబ్రవరి 12వ తేదీన అంటే శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయి. అభిజిత్ ముహుర్తం ఉదయం 8:34 నుండి రాత్రి 9:55 గంటల వరకు.. మరియు మధ్యాహ్నం 12 గంటల నుండి 13:12 గంటల వరకు ఉంటుంది.

ఈ గుప్త నవరాత్రుల్లోని తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని ఈ రూపాలలో అలంకరించి ఆరాధిస్తారు.

ఫిబ్రవరి 12న తొలిరోజు కాళికా దేవి..

ఫిబ్రవరి 13న రెండో రోజు త్రిపుర తారా దేవి (శైల్‌పుత్రి పూజ)

ఫిబ్రవరి 14న మూడో రోజు సుందరీ దేవి (బ్రహ్మచారిని పూజ)

ఫిబ్రవరి 15న నాలుగో రోజు భువనేశ్వరి దేవి (చంద్రఘంట పూజ)

ఫిబ్రవరి 16న ఐదో రోజు మాతా చిత్రమాస్తా త్రిపుర దేవి (కుష్మండ పూజ)

ఫిబ్రవరి 17న ఆరో రోజు భైరవి దేవి (స్కందమాట పూజ)

ఫిబ్రవరి 18న ఏడో రోజు మాధుమతి దేవి (శక్తి)

ఫిబ్రవరి 19న ఎనిమిదో రోజు మాతా బాగలముఖి దేవి (కాత్యాయని పూజ)

ఫిబ్రవరి 20న తొమ్మిదో రోజు మాతంగి కమలాదేవిగా (మహాగౌరి పూజ) అలంకరించి పూజిస్తారు.

అయితే మాఘా గుప్తా నవరాత్రి పండువ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు. ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్. ఉత్తరాఖండ్లలో మాత్రమే మఘ గుప్త నవరాత్రులను జరుపుకుంటారు.

ఈ గుప్త నవరాత్రి సమయంలో దేవత యొక్క కోపాన్ని తగ్గించేందుకు జరుపుకుంటారు. ఈ సమయంలో దేవి తన భక్తులకు ఆరోగ్యం, శ్రేయస్సు, జ్ణానం మరియు సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది. గుప్త నవరాత్రుల సమయంలో అన్ని రకాల భయాలు మరియు ఆందోళనలు తగ్గిపోతాయి. భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తారు.

Also Read:

మన దేశంలో కాలక్రమంలో చరిత్రలో మాయమై.. నేడు పర్యాటక రంగాలుగా విలసిల్లుతున్న నగరాలు

ప్రాణాపాయంలో ఉన్న కల్నల్‌ను స్వయంగా కాపాడిన శివుడు.. భక్తులుగా మారి గుడి కట్టిన బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ దంపతులు