AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఫిబ్రవరి 13 రాశిఫలాలు.. అరుదైన ఆహ్వానాలు.. కుటుంబంలో గౌరవం.. వస్తులాభాలు, వ్యాపారాల వృద్ధి..

Horoscope Today: మన దేశంలో రాశిఫలాలను చాలా మంది నమ్ముతుంటారు. ఈరోజు వారి స్థితి ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తితో ఉంటారు.

Horoscope Today: ఫిబ్రవరి 13 రాశిఫలాలు.. అరుదైన ఆహ్వానాలు.. కుటుంబంలో గౌరవం.. వస్తులాభాలు, వ్యాపారాల వృద్ధి..
uppula Raju
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 13, 2021 | 12:39 PM

Share

Horoscope Today: మన దేశంలో రాశిఫలాలను చాలా మంది నమ్ముతుంటారు. ఈరోజు వారి స్థితి ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తితో ఉంటారు. ఈ రోజు అంటే ఫిబ్రవరి 13 శనివారం మేషం నుంచి మీనం వరకు మిగిలిన రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి.. పనుల్లో ముందడుగు వేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహంగా ఉంటుంది. దుర్గ అమ్మవారికి ఎరుపు రంగులోని పుష్పాలు సమర్పణ చేయడం మంచిది.

వృషభరాశి.. బంధువర్గంతో తగాదాలు. శ్రమకు ఫలితం ఉండదు. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. మహాలక్ష్మీ కుంకుమార్చన నిర్వహించడం మంచింది.

మిధున రాశి.. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలించవు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. దుర్గ అమ్మావారికి కుంకుమ అర్చన చేయడం మంచింది.

కర్కాటక రాశి.. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. శ్రీవెంకటేశ్వర దర్శనం మేలు చేస్తుంది.

సింహ రాశి.. మిత్రుల నుంచి పిలుపు అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి. నవగ్రహ స్తోత్ర పరాయణం మేలు చేస్తుంది.

కన్యారాశి.. ఆర్థిక ఇబ్బందులు. రుణదాతల ఒత్తిడులు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

తులరాశి.. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని ప్రగతి. మహాలక్ష్మీ అమ్మవారికి గులాబీ పూవ్వులతో అర్చన నిర్వహించడం మంచింది.

వృశ్చిక రాశి.. సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.పేదవారికి గోదుమలను ధానం చేయడం మంచింది.

ధనుస్సు రాశి.. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.పేదవారికి పాలు, పండ్లు ధానం చేయడం మంచింది.

మకర రాశి.. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త పనులు చేపడతారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. దేవి ఖడ్గమాల స్తోత్రం మేలు చేస్తుంది.

కుంభ రాశి.. బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అష్టలక్ష్మి స్తోత్రం మంచింది.

మీన రాశి.. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. అనారోగ్యం. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పరమేశ్వరుని ఆరాధన మంచింది.