Lord Shiva: కోరుకున్న జీవిత భాగస్వామి కోసం శివయ్యను సోమవారం ఇలా పూజించండి..

శివుడిని ఆరాధించే భక్తులపై మహాదేవుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. శివుడిని ఆరాధించడం ద్వారా కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈరోజు శివయ్యను పూజించే విధి విధానాలను గురించి తెలుసుకుందాం.. 

Lord Shiva: కోరుకున్న జీవిత భాగస్వామి కోసం శివయ్యను సోమవారం ఇలా పూజించండి..
Lord Shiva
Follow us
Surya Kala

|

Updated on: Aug 22, 2022 | 4:43 PM

Lord Shiva: హిందూ మతంలో శివుని ఆరాధన అత్యంత సులభమైనదిగా పరిగణించబడుతుంది. భక్తి శ్రద్దలతో నీరు, బిల్వ పాత్రలను సమర్పించినా చాలు శివయ్య సంతోషిశాడు. భక్తులను అనుగ్రహిస్తాడు. సనాతన సంప్రదాయంలో శివయ్యను పూజించడం, అతని ఆశీర్వాదం పొందడం అత్యంత పవిత్రమైనది రోజు సోమవారం. ఈ రోజున శివుడిని ఆరాధించే భక్తులపై మహాదేవుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. శివుడిని ఆరాధించడం ద్వారా కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈరోజు శివయ్యను పూజించే విధి విధానాలను గురించి తెలుసుకుందాం..

కోరుకున్న జీవిత భాగస్వామి కోసం: సంతోషకరమైన వైవాహిక జీవితం, కోరుకున్న జీవిత భాగస్వామిని పొందడానికి, శివుని ఆరాధన అత్యంత పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాదు వైవాహిక జీవితంలో ఏదైనా సమస్య ఉంటే లేదా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడినా సోమవారం శివాలయానికి వెళ్లి శివయ్య దర్శనం చేసుకోండి. లేదా మీ ఇంట్లోని కుంకుమ కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. ఈ పరిహారం చేయడం ద్వారా సంతోషకరమైన వైవాహిక జీవితం లభిస్తుంది.

సమస్త దోషాలను తొలగించే శివారాధన  జీవితానికి సంబంధించిన ఏవైనా దోషాలు లేదా బాధలను తొలగించడానికి శివారాధన అత్యంత ప్రభావవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది. సోమవారం రోజున భక్తి శ్రద్దలతో పూజించే భక్తుడి దుఃఖాన్ని, బాధను శివుడు తొలగిస్తాడని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడిని ఆరాధించే భక్తుడిని శనీశ్వరుడు ఎప్పుడూ వేధించడు. సుఖ సంతోషలతో జీవిస్తాడని నమ్మకం.

ఇవి కూడా చదవండి

కష్టాలను తీర్చే మహాదేవుని మంత్రం:  జీవితంలో శారీరక, మానసిక బాధ పడుతుంటే.. అది వ్యక్తిపై తీవ్ర ప్రభావితం చూపిస్తోంది. వ్యాధికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే.. రోగం నుంచి విముక్తి కలగడానికి రుద్రాక్ష జపమాలతో శివుని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మెడలో ధరించే రుద్రాక్ష మాలతో శివ మంత్రాన్ని జపించకూడదని గుర్తుంచుకోండి. బదులుగా ఎల్లప్పుడూ మంత్రం జపించే మాలలను వేరుగా పూజ గదిలో ఉంచాలి. మనస్సులో మహాదేవుని మంత్రాన్ని ఎల్లప్పుడూ జపిస్తూ.. శివనామస్మరణ చేస్తూ ఉండడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)