AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toli Ekadashi: తొలి ఏకాదశి రోజున విష్ణువు నిజంగా నిద్రలోకి వెళ్తారా.. ఈ మాసాన్ని శూన్యమాస మని ఎందుకు అంటారో తెలుసా..!

హరి శయనుని నాలుగు నెలల నిద్ర కాలాన్ని చాతుర్మాసం అంటారు. చాతుర్మాస పూజ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అందుకనే ఈ సమయంలో శుభకార్యాలు చేయడం నిషేధించబడింది.

Toli Ekadashi: తొలి ఏకాదశి రోజున విష్ణువు నిజంగా నిద్రలోకి వెళ్తారా.. ఈ మాసాన్ని శూన్యమాస మని ఎందుకు అంటారో తెలుసా..!
Toli Ekadashi
Surya Kala
|

Updated on: Jul 06, 2022 | 10:59 AM

Share

Toli Ekadashi 2022: హిందూ సంప్రదాయాల ప్రకారం ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి మాసంలోనూ రెండు సార్లు ఏకాదశి వస్తుంది. అయితే ఆషాఢమాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. ఈ  ఏకాదశిని దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని అంటారు . దేవశయని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. అందుకే యోగినీ ఏకాదశిని చాలా ముఖ్యమైందిగా భావిస్తారు. ఈ నాలుగు నెలలు ప్రపంచాన్ని నడిపించే బాధ్యత పరమశివుడి చేతిలోనే ఉంటుంది . విష్ణువు యోగ నిద్రలోకి వెళ్లడం వల్ల ఈ ఏకాదశిని దేవశయని అని, హరిశయని ఏకాదశి అని అంటారు. హరి శయనుని నాలుగు నెలల నిద్ర కాలాన్ని చాతుర్మాసం అంటారు. చాతుర్మాస పూజ చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అందుకనే ఈ సమయంలో శుభకార్యాలు చేయడం నిషేధించబడింది.

కార్తీకమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున నారాయణుడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు.. ఆ రోజు నుండి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆషాడం తొలి ఏకాదశి జూలై 10వ తేదీ..ఆదివారం రోజున వచ్చింది. దేవశయని ఏకాదశి నాడు నిజంగా విష్ణువు నిద్రపోతారా లేదా నిద్రకు మరేదైనా అర్థం ఉందా పురాణాలు ఏమి పేర్కొన్నాయి తెలుసుకుందాం.

జ్యోతిష్యుడు డాక్టర్ అరవింద్ మిశ్రా ప్రకారం, చైతన్య స్థాయిలో ఎప్పుడూ మెలకువగా ఉండే వ్యక్తిని దేవుడిగా భావిస్తారు. అలాంటి పరిస్థితిలో ఎప్పుడూ మెలకువగా ఉండే భగవంతుడు అంత కాలం ఎలా నిద్రపోతాడు? నిజానికి దేవశయన, దేవజాగరణ అనేవి నియమాలు సామాన్య ప్రజల కోసం ఋషులు చేసిన ఏర్పాటు చేసినవి అని చెప్పారు. ప్రజలు సాంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితాన్ని కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవచ్చు. దేవశయని ఏకాదశి నుంచి దేవుత్తని ఏకాదశి వరకు వాతావరణంలో మార్పు వస్తుంది. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ఈ రోజుల్లో శుభకార్యాలు నిర్వహించకుండా కొన్ని నియమాలను పాటించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

నిబంధనలు ఏమిటంటే: దేవశయని ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. కొన్ని రోజుల తర్వాత.. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం వర్షాకాల మాసం. వర్షాకాలం ముగిసిన తరువాత.. శరదృతువు ప్రారంభమవుతుంది. అంటే ఈ చాతుర్మాసాలు రుతువులు మారే మాసాలు. వాతావరణం మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దగ్గు, జలుబు , ఫ్లూ లతోపాటు ఇన్ఫెక్షన్ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. అన్ని కూరగాయలు , పండ్లలో బ్యాక్టీరియా, కీటకాలు పెరగడం ప్రారంభిస్తాయి. వర్షం కారణంగా సాధారణ వ్యక్తి తన జీవితాన్ని ఇంటి వద్దనే ఎక్కువఆ గడిపేస్తాడు. ఈ కారణంగా ఈ నాలుగు మాసాలలో శుభకార్యాలు చేయవద్దని.. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సంయమనం పాటించాలని సూచించారు.

ఈ నాలుగు నెలలు ఏమి చేయాలంటే.. 

ఈ నాలుగు మాసాల్లో మనిషి మానసిక దృఢత్వం కోసం భగవంతుడిని పూజించాలి.

వేయించిన, కాల్చిన ఆహారం, పాలు , ఇతర పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. తేలికైన, జీర్ణమయ్యే, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. రోజులో ఒక్కోసారి భోజనం చేయడం మంచిది.

వర్షాకాలం చాతుర్మాస సమయంలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, అనేక రకాల కీటకాలు వృద్ధి చెందుతాయి. అటువంటి పరిస్థితిలో, బెండకాయ, క్యాబేజీ, ముల్లంగి, ఆకు కూరలు తినకూడదు.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, యోగా , ప్రాణాయామం చేయాలి .

వర్షం కారణంగా , జనజీవనం, ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడుతుంది.. కనుక ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదని పెద్దలు ఆషాడం శూన్యమాసంగా సూచించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)